మధ్యంతర బెయిల్ కోరిన బెంగళూర్ టేకీ మాజీ భార్య
వివరాలు సుప్రీంకోర్టుకు అందజేయాలన్న హైకోర్టు;
By : The Federal
Update: 2025-01-01 11:20 GMT
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బెంగళూర్ టేకీ అతుల్ సుభాష్ ఆత్మహత్య కేసు విచారణ విషయాన్ని సుప్రీంకోర్టు కు తెలియజేయాలని, అతని తండ్రికి కర్ణాటక హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఆత్మహత్య కు కారణమైన టెకీ మాజీ భార్య అనిత సింఘానియా ప్రస్తుతం జ్యూడిషియల్ కస్టడీలో ఉన్నారు.
ఈ రోజు జస్టిస్ హేమంత్ చందంగౌడ్ కేసును విచారించారు. అతుల్ తల్లి తన మైనర్ మనవడిని కస్టడీకి ఇవ్వాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసారని, తమకు దీనిపై పిటిషన్ పై దాఖలు చేసుకోవాల్సిన అవసరం ఉందని నికితా తరఫు లాయర్ వాదించారు.
ఆమెను అరెస్ట్ చేయడం చట్ట విరుద్దమైనదిగా కూడా న్యాయవాదీ భరత్ కుమార్ కోర్టులో తెలిపారు. పోలీసులు నిర్భంధంలోకి తీసుకోవడానికి విఫలమయ్యారని పేర్కొన్నారు. తనకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కోర్టును అభ్యర్థించారు. తనను తాను రక్షించుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. నికితా అరెస్ట్ చట్టబద్దతను సవాల్ చేయడంతో న్యాయమూర్తి మధ్యంతర ఉత్తర్వూలు జారీ చేశారు.
అయితే రాష్ట్ర పబ్లిక్ ప్రాసిక్యూటర్- II విజయ్ కుమార్ మజాగే దర్యాప్తు వివరాలు అందించడానికి జనవరి 6 వరకూ గడువు కోరారు. దీనిపై ఆమె తరఫు న్యాయవాదీ అభ్యంతరం తెలిపారు. ట్రయల్ కోర్టు నికితా సహ ఇతర నిందితుల బెయిల్ దరఖాస్తులను విచారణను జనవరి 4 కు షెడ్యూల్ చేసిందని ఆయన కోర్టుకు తెలిపారు. బెయిల్ పిటిషన్ పై అదే రోజు నిర్ణయం తీసుకోవాల్సిందిగా కోర్టును అభ్యర్థించారు. దీనికి హైకోర్టు అంగీకరించింది.
కేసు వివరాలు...
ఉత్తర ప్రదేశ్ కు చెందిన టెకీ అతుల్ సుభాష్ గత నెలలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన సూసైడ్ కి దారి తీసిన పరిస్థితులను 24 పేజీల లేఖలో సవివరంగా రాశారు. తనను సెక్షన్ 498 ఏ కింద ఎలా హింసించారో, కోర్టులో తనను అవమానించడం, దానికి జడ్జి నవ్వడంతో తీవ్ర మనస్థాపం చెందినట్లు రాశారు.
అనారోగ్య కారణాలతో తన మామ మరణిస్తే అదనపు కట్నం తేవాలని నేను వేధించడంతోనే మరణించినట్లు కేసు దాఖలు చేశారని పేర్కొన్నారు. కేవలం రూ. 10 లక్షల అదనపు కట్నం కావాలని నేను అడినట్లు పేర్కొన్నారని, తనకు ఓ సంవత్సరం రూ. 80 లక్షల ఆదాయం వచ్చినట్లు తెలిపారు.
చివరకు తన కొడుకును చూడనివ్వకుండా అడ్డుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు న్యాయం జరిగే వరకూ తన అస్థికలను నిమజ్జనం చేయవద్దని, అన్యాయం జరిగితే కోర్టు ముందున్న మురికి గుంటలో నిమజ్జనం చేయాలని ఆత్మహత్య లేఖలో కోరారు. దీనిపై సర్వోన్నత న్యాయస్థానం స్పందించింది. సెక్షన్ 498 ఏ విషయంలో వెంటనే కొన్ని మార్గదర్శకాలను విడుదల చేసింది.