BJP | తనకు తాను శిక్షించుకున్న తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలై

లైంగిక వేధింపుల ఘటనలో బాధితురాలికి న్యాయం చేయాలంటూ తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు కె. అన్నామలై తనకు తాను కొరడాతో కొట్టుకున్నారు.

Update: 2024-12-27 10:49 GMT

తమిళనాడు రాజధాని చెన్నైలోని అన్నా యూనివర్శిటీలో ఓ విద్యార్థినిపై లైంగిక వేధింపుల ఘటన ఆ రాష్ట్రంలో తీవ్ర దుమారం రేపుతోంది. బాధితురాలికి న్యాయం చేయాలంటూ తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు కె. అన్నామలై వినూత్నంగా నిరసన తెలిపారు. తనకు తాను శిక్షించుకున్నారు. కోయంబత్తూరులోని తన ఇంటి బయట కొరడా దెబ్బలు కొట్టుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. లైంగిక వేధింపుల కేసును అధికార పార్టీ డీఎంకే పక్కదారి పట్టిస్తోందని ఆరోపించిన అన్నామలై.. రాష్ట్రంలో స్టాలిన్ సర్కారును గద్దె దించే వరకు తాను చెప్పులు వేసుకోనని శపథం కూడా చేశారు.

నిందితుడిపై ఇప్పటికే 15 కేసులు పెండింగ్..

బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి సీసీ కెమెరాల ఆధారంగా కోట్టూర్‌పురం జ్ఞానశేఖరన్‌కు అరెస్ట్‌ చేశారు. నిందితుడిని కోర్టులో హాజరుపర్చగా 15 రోజులు జ్యుడిషియల్‌ కస్టడీ విధిస్తూ సైదాపేట కోర్టు ఆదేశించింది. మొదట నేరాన్ని నిరాకరించినా.. ఆధారాలను చూపి ప్రశ్నించడంతో అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. జ్ఞానశేఖరన్‌పై ఇప్పటికే చోరీ, దోపిడీ కేసులున్నాయి. 15 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. 2011లో అన్నావర్సిటీలోని ఓ విద్యార్థిని వీడియో తీసి బెదిరించిన కేసులో అరెస్ట్‌ అయినట్లు తేలింది. పోలీసుల అదుపులో నుంచి పారిపోయే యత్నం చేసిన జ్ఞానశేఖరన్‌ కిందపడటంతో ఎడమ చెయ్యి, ఎడమ కాలు ఎముక విరిగింది. చెన్నై స్టాన్లీ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స చేయించాక నిందితుడిని పుళల్‌ జైలుకు తరలించారు పోలీసులు.

Full View

Tags:    

Similar News