కేరళ మాజీ ముఖ్యమంత్రి వీఎస్ అచ్యుతానందన్ కన్నుమూత

అధికారికంగా ధృవీకరించిన కేరళ సర్కార్;

Update: 2025-07-21 11:46 GMT
కేరళ మాజీ ముఖ్యమంత్రి వీఎస్ అచ్యుతానందన్

కేరళ మాజీ ముఖ్యమంత్రి వీ ఎస్ అచ్యుతానందన్ సోమవారం కన్నుమూశారు. సీపీఐ(ఎం) సీనియర్ నేత 2017 నుంచి క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్నారు.

మరణానికి ముందు ఒక నెల పాటు ఆయన ఆసుపత్రిలో ఉన్నారు. 2017 లో పరిపాలన సంస్కరణల కమిటీ చైర్మన్ పదవి నుంచి వైదొలిగిన తరువాత వీఎస్ అచ్యుతానందన్ వృద్దాప్య బలహీనతల కారణంగా రాజకీయాలను దూరంగా ఉంటున్నారు. 

గుండెపోటుతో బాధపడుతున్న..
ఆయన ఆరోగ్యం క్షీణించడంతో జూన్ 23న తిరువనంతపురం మెడికల్ కాలేజ్ ఆసుపత్రిలో చేరారు. గుండెపోటుతో బాధపడుతున్న తరువాత వీఎస్ అచ్యుతానందన్ తిరువనంతపురంలోని ఎస్సీటీ ఆసుపత్రిలోని ఐసీయూలో చేర్చారు. ఆయనకు దగ్గర వైద్య పర్యవేక్షణ, వెంటిలేటర్ అందించినప్పటికీ పూర్తి స్పృహ రాలేదు.
ముఖ్యమంత్రి పినరయి విజయన్, సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి ఎంవీ గోవిందన్ ఆసుపత్రిని సందర్శించి, వైద్యబోర్డులతో అచ్యుతానందన్ కుటుంబ సభ్యులతో సంప్రదింపులు జరిగిన తరువాత మరణవార్తను అధికారికంగా ప్రకటించారు. ఆయన భార్య వసుమతి కుమారుడు డాక్టర్ వీఏ అరుణ్ కుమార్, కుమార్తె డాక్టర్ వీఏ ఆశా ఉన్నారు.
అలుపెరగని యోధుడు
‘‘వీఎస్ నిరంతర యోధుడు, కార్మిక వర్గ పురోగతికి శక్తివంత పోరాటాలు చేసిన పోరాట యోధుడు. కేరళ రాజకీయ స్వరూపాన్ని మార్చిన లెక్కలేనన్నీ ఆందోళనలు రూపొందించి నడిపించిన కమ్యూనిస్టుగా ఆయన ప్రదర్శించిన నిబద్దత అచంచలమైనది’’
ఏ సమాజంలోనైనా ఉత్సాహాన్ని రగిలించే అరుదైన సామర్థ్యం ఏదైన సంక్షోభాన్ని నేరుగా ఎదుర్కొనే శక్తి వీఎస్ కు ఉంది. విప్లవ నాయకుడు ఇప్పుడు శాశ్వత విశ్రాంతిలోకి అడుగుపెట్టాడు’’ అని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి ఎంవీ గోవిందన్ అన్నారు.
Tags:    

Similar News