యడియూరప్పకు ముందస్తు బెయిల్‌ .. కేసు కొట్టివేతకు అంగీకరించని హైకోర్టు

మాజీ సీఎం బీఎస్‌ యడ్యూరప్పకు కర్ణాటక హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. పోక్సో కేసును కొట్టివేసేందుకు నిరాకరించిన హైకోర్టు.. ముందస్తు బెయిల్‌ను మంజూరు చేసింది.;

Update: 2025-02-07 09:33 GMT
Click the Play button to listen to article

కర్ణాటక హైకోర్టు మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప(Yediyurappa)కు కాస్త ఊరట లభించింది. ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరయ్యింది. అయితే తనపై POCSO చట్టం కింద నమోదైన క్రిమినల్ కేసును కొట్టివేయాలని సవాల్ చేస్తూ యడియూరప్ప గతంలో హైకోర్టు (Karnataka High court) పిటిషన్ దాఖలు చేశారు. ఆ అభ్యర్థనను కొట్టివేసిన కోర్టు.. ముందస్తు బెయిల్‌తో సరిపెట్టింది. తిరిగి కేసును ట్రయల్‌ కోర్టుకు అప్పగిస్తూ హైకోర్టు న్యాయమూర్తు ఎం నాగప్రసన్న శుక్రవారం తీర్పు వెలువరించారు.

అసలు కేసేమిటి?

ఓ కేసులో న్యాయం చేయాలని 2024 ఫిబ్రవరి 2న 17 ఏళ్ల బాధితురాలు, ఆమె తల్లి బెంగళూరులోని డాలర్స్ కాలనీలోని యడ్యూరప్పను నివాసానికి వెళ్లారు. ఆ సమయంలో తన కుమార్తె లైంగిక వేధింపులకు గురైందని బాధితురాలి తల్లి సదాశివనగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో యడ్యూరప్పపై పిల్లల రక్షణ చట్టం, 2012 (పోక్సో) సెక్షన్ 8, ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 354A కింద కేసు కట్టారు. కేసు కోర్టులో నడుస్తుండగా.. ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో హుళిమావు సమీపంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో బాధితురాలి తల్లి చనిపోయింది. నిష్పాక్షిక దర్యాప్తు కోసం కర్ణాటక ప్రభుత్వం ఈ కేసును నేర పరిశోధన విభాగం (సీఐడీ)కి బదిలీ చేసింది. సీఐడీ అధికారులు యడియూరప్పపై జూన్ 27న చార్జీషీట్ ఫైల్ చేశారు. ఇదే సమయంలో తనపై నమోదయిన ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేయాలని ఆయన కర్ణాటక హైకోర్టులో పిటీషన్ వేశారు. ఏమైనా అభ్యంతరాలుంటే తెలపాలని, అప్పటిదాకా యడియూరప్పను అరెస్టు చేయవద్దని సీఐడీని ఆదేశించింది.

విచారణలో యడియూరప్పతో పాటు మరో ముగ్గురు సహాయకులు - అరుణ్ వై ఎం, రుద్రేష్ ఎం, జి మరిస్వామిని నిందితులుగా చేర్పింది CID. 

Tags:    

Similar News