MUDA కేసులో కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు హైకోర్టు నోటీసు

ముడా స్థలం కేటాయింపు కేసును సీబీఐకి బదిలీ చేయాలని ఆర్టీఐ కార్యకర్త స్నేహమయి కృష్ణ దాఖలు చేసిన రిట్ పిటిషన్‌పై కర్ణాటక హైకోర్టు మంగళవారం విచారించింది.

Update: 2024-11-05 08:39 GMT

ముడా స్థలం కేటాయింపు కేసును సీబీఐకి బదిలీ చేయాలని ఆర్టీఐ కార్యకర్త స్నేహమయి కృష్ణ దాఖలు చేసిన రిట్ పిటిషన్‌పై కర్ణాటక హైకోర్టు మంగళవారం విచారించింది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఇతరులకు నోటీసులు జారీ చేసింది. సీఎం భార్య పార్వతి, బావమరిది మల్లికార్జున స్వామి, యూనియన్‌ ఆఫ్‌ ఇండియా, రాష్ట్ర ప్రభుత్వం, సీబీఐ, లోకాయుక్తలకు కూడా నోటీసులు పంపాలని జస్టిస్‌ ఎం.నాగప్రసన్న సూచించారు. ఈ కేసులో ఇప్పటి వరకు నిర్వహించిన దర్యాప్తు వివరాలను భధ్రంగా ఉంచాలని లోకాయుక్తను ఆదేశిస్తూ తదుపరి విచారణను నవంబర్ 26కి వాయిదా వేసింది కోర్టు.

సిద్ధరామయ్యతో పాటు మరికొందరికి నోటీసులు

మరోవైపు ఈ కేసులో ప్రథమ నిందితుడిగా ఉన్న సిద్ధరామయ్యను లోకాయుక్త పోలీసులు నవంబర్ 6న విచారణకు పిలిచారు. ఇదే కేసులో నిందితురాలిగా ఉన్న అయన భార్యను అక్టోబర్ 25న ప్రశ్నించారు. మైసూరు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (ముడా) ద్వారా తన భార్యకు 14 స్థలాల కేటాయింపులో సీఎం అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలు సిద్ధరామయ్యను వెంటాడుతున్నాయి.

దేవరాజు నుంచి మల్లికార్జున స్వామి భూమిని కొని దాన్ని తన సోదరి పార్వతికి బహుమతిగా ఇచ్చాడు. స్వామి, దేవరాజు కూడా ఇదివరకు లోకాయుక్త పోలీసుల ఎదుట హాజరయ్యారు.

Tags:    

Similar News