కల్పిత తీర్పులు ఉదహరించిన జడ్జిపై హైకోర్టు ఆగ్రహం..

సివిల్ జడ్జి ఉదహరించిన కోర్టు తీర్పులు కల్పితమని తేల్చిన కర్ణాటక హైకోర్టు.;

Update: 2025-03-27 09:13 GMT
Click the Play button to listen to article

డబ్బుతో ముడిపడిన ఓ కేసులో బెంగళూరులోని ఒక సివిల్ కోర్టు జడ్జి రెండు కల్పిన తీర్పులను ఉదహరించారు. గతంలో అవి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులని చెప్పుకొచ్చారు. అయితే వాటిని పరిశీలించిన హైకోర్టు అవి పూర్తిగా కల్పితమని తేల్చింది. సదరు న్యాయమూర్తిపై చర్యలు తీసుకోవాలని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఆర్ దేవదాస్ సూచించారు.

కేసు నేపథ్యం..

సమన్ క్యాపిటల్ లిమిటెడ్ మంత్రి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్‌కి కొంత డబ్బు అప్పుగా ఇచ్చింది. రుణం తిరిగి చెల్లించకపోవడంతో వాటాలను తమ పేరున బదిలీ చేయాలంటూ సెప్టెంబరులో సమన్ క్యాపిటల్ లిమిటెడ్ బెంగళూరులోని వాణిజ్య కోర్టును ఆశ్రయించారు. ప్రతిస్పందించిన మంత్రి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్‌..ఇంజక్షన్ ఆర్డర్ కోసం అప్పీలు చేసుకుంది. ఆ తర్వాత కోర్టుకు తెలపకుండానే దాన్ని రద్దు చేసుకుని సిటీ సివిల్ కోర్టులో మరో కేసు ఫైల్ చేసింది మంత్రి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్‌. దీనిపై సమన్ క్యాపిటల్ లిమిటెడ్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ డబ్బుకు సంబంధించిన కేసు కావడంతో వాణిజ్య కోర్టులోనే పరిష్కరించాలని కోరింది. అయితే జడ్డి ఈ కేసు తమ పరిధిలోకే వస్తుందని చెబుతూ గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను ఉదహరించారు సిటీ సివిల్ కోర్టు జడ్జి. అయితే జడ్జి ఆదేశాలను సవాలు చేస్తూ సమన్ క్యాపిటల్ లిమిటెడ్ హైకోర్టులో రివిజన్ పిటిషన్‌ వేసింది. ఆ పిటీషన్‌ను విచారించిన హైకోర్టు, తీర్పు నమ్మదగినదిగా లేదని హైకోర్టు జస్టిస్ ఆర్ దేవదాస్ పేర్కొన్నారు. జడ్జి ప్రవర్తన "ఆందోళనకరం"గా ఉందని, దీనిపై మరింత విచారణ అవసరమని ఆయన పేర్కొన్నారు.

Tags:    

Similar News