కచ్చతీవు: ప్రధాని మోదీ సెల్ప్ గోల్ చేసుకున్నారా?

ఎన్నికల ముందు భారత ప్రధాని నరేంద్ర మోదీ లెవనెత్తిన కచ్చతీవు అంశంలో ఏం జరిగింది. కచ్చతీవు శ్రీలంకు అప్పగించిన భారత్..బదులుగా ఏం తీసుకుంది.

Update: 2024-04-07 06:19 GMT

సార్వత్రిక ఎన్నికల ముందు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తమిళనాడు పర్యటనలో భాగంగా హఠాత్తుగా కచ్చతీవు ద్వీపం అంశాన్ని ప్రస్తావించి ద్రవిదవాద పార్టీలు, కాంగ్రెస్ ను కార్నర్ చేసే ప్రయత్నం చేశారు. తరువాత ఈ అంశం రాష్ట్రంలో రాజకీయ పార్టీల నుంచి సామన్య ప్రజలు, ఓటర్లు ఇలా అందరూ విషయం తెలుసుకునేందుకు ఆసక్తి చూపించే ప్రయత్నం చేశారు. అలా రాత్రికి రాత్రే కచ్చతీవు అందరి మదిలో మెదిలింది.

సెల్ఫ్ గోల్..
తమిళనాడులో కచ్చతీవు అంశం సున్నితమైన సమస్య అనడంలో సందేహం లేదు. మోదీ,  కాంగ్రెస్ పార్టీ అధికార డీఎంకే ను ఇబ్బంది పెట్టేందుకు ఈ ఎత్తు వేశారు. కానీ అది సెల్ఫ్ గోల్ అయినట్లు తెలుస్తోంది. కచ్చతీవు సమస్యపై అందుబాటులో ఉన్న అన్ని విషయాలను పరిశీలిస్తే, అప్పటి ఇందిరాగాంధీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చాలావరకు భారతదేశానికి ప్రయోజనం చేకూర్చే విధంగా పనిచేస్తుందని తేలింది.
కొలంబోకు వదులుతున్నారా?
1974లో భారతదేశం కచ్చతీవు ద్వీపాన్ని శ్రీలంకకు అప్పగించింది. కానీ నిజానికి ఈ ద్వీపం భారత్‌కు చెందింది కాదు. పాక్ జలసంధిలో భారతదేశం, లంక మధ్య ఉన్న చిన్న ద్వీపం కచ్చతీవు. చారిత్రాత్మకంగా వివాదాస్పద భూభాగం. ఈ వివాదం 1920ల నాటిది, రెండు దేశాలను బ్రిటిష్ వారే పాలించారు. అయితే ఈ వివాదాన్ని పరిష్కరించలేక, ద్వీపం చుట్టూ చేపలు పట్టడానికి ఇరు దేశాల మత్స్యకారులను అనుమతించాయి. ఈ ద్వీపంలో సెయింట్ ఆంథోని క్రిస్టియన్ రోమన్ క్యాథలిక్ మందిరం తప్ప ఏమి లేదు.
భారత్-లంక చర్చలు
స్వాతంత్ర్యం తర్వాత (1947లో భారతదేశానికి, శ్రీలంక - పూర్వం సిలోన్ - 1948లో), వివాదం మళ్లీ తెరపైకి వచ్చింది. తీవ్రమైన చర్చల తర్వాత, 1974లో, రెండు దేశాల మధ్య అంతర్జాతీయ సముద్ర సరిహద్దును రూపొందించుకున్నాయి. పాక్ జలసంధిలో ఉన్న కచ్చతీవు కోసం భారతదేశం తన వాదనను విరమించుకుంది, భారత మత్స్యకారులను ద్వీపం పరిసర ప్రాంతాల్లో చేపలు పట్టడానికి ఇప్పటికీ అనుమతి ఉంది.
రెండు సంవత్సరాల తరువాత, 1976లో, రెండు దేశాల ప్రత్యేక ఆర్థిక మండలి రూపొందించబడింది. కచ్చతీవు చుట్టుపక్కల ఉన్న ఎకనామిక్ జోన్ లంకకు చెందినది కావడంతో భారతీయ మత్స్యకారులు ఆ ప్రాంతంలోకి ప్రవేశించకుండా ఆంక్షలు విధించారు. అయితే ఇక్కడ భారత ప్రభుత్వం నిజానికి గల్ఫ్ ఆఫ్ మన్నార్‌లో కేప్ కొమోరిన్ (ప్రస్తుతం కన్యాకుమారి అని పిలుస్తున్నారు)కి సమీపంలో ఒక వాడ్జ్ బ్యాంక్ కోసం బేరం కుదుర్చుకుంది.
వాడ్జ్ బ్యాంక్
ఈ సమస్యపై ఇటీవలి నివేదికలలో, "వాడ్జ్ బ్యాంక్" అనే పదం చాలా మందిని ఆశ్చర్యపరిచింది. శ్రీలంక లో భారత కాన్సుల్ ఏ జనర్ లగా పనిచేసిన నటరాజన్ ఇటీవల ఫెడరల్ కు వీడియో ఇంటర్వ్యూ ఇచ్చారు. తాను కూడా ఇప్పుడే ఈ వాడ్జ్ బ్యాంక్ గురించి విన్నానని చెప్పి దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. "వాడ్జ్ బ్యాంక్" నివేదికలు అది ఒక లొకేషన్ సరైన పేరు వలె కనిపించేలా చేస్తాయి.
'వాడ్జ్ బ్యాంక్' అనేది కేవలం సముద్ర పర్యావరణ వ్యవస్థ అని తేలింది, అంటే ఒక నిర్దిష్ట జీవ-వైవిధ్యం, స్వభావం కలిగిన ప్రాంతం అని అర్థం, దానిని ఆ పేరుతో పిలవడానికి అర్హత ఉంటుంది. కన్యాకుమారికి దగ్గరగా ఉన్న ఈ వాడ్జ్ బ్యాంకు ఉంది. ప్రపంచంలో కనీసం 20 'వాడ్జ్ బ్యాంక్‌లు' ఉన్నాయి.
1974-76లో, భారత ప్రభుత్వం శ్రీలంకతో చర్చలు జరిపి, ఈ 'వాడ్జ్ బ్యాంక్'ని తన ప్రత్యేక ఆర్థిక జోన్‌లోకి తీసుకురాగలిగింది. కచ్చతీవు తమదేనని శ్రీలంక వాసులు సంతోషించారు. ఆ ప్రాంతాన్ని భారతదేశం ఆధీనంలోకి తెచ్చుకోవడాన్ని పట్టించుకోవడం లేదు.
ఈ 'వాడ్జ్ బ్యాంక్' భారతదేశంలోనే అత్యంత గొప్ప వైవిధ్యం ఉన్నదని చెప్పవచ్చు. చేపలు పుష్కలంగా లభిస్తాయి. 'వాడ్జ్ బ్యాంక్' కింద గణనీయమైన పరిమాణంలో చమురు ఉండవచ్చు అనే సమాచారం భారత ప్రభుత్వానికి తెలిసిన సీక్రెట్ సమాచారం. ఇది బయటకు రాకుండా వేగంగా చర్చల ప్రక్రియను పూర్తి చేసింది.
చమురు అవకాశాలు
గత 50 సంవత్సరాలుగా, కన్యాకుమారి ప్రాంతంలోని భారతీయ మత్స్యకారులు ఈ ప్రాంతం నుంచి భారీ సంఖ్యలో చేపలను పట్టుకుని ఉఫాది పొందుతున్నారు. కొన్ని నెలల క్రితం, కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ సహజ వాయువు ఈ ప్రాంతంలో చమురు బ్లాక్‌లను అన్వేషించడానికి అభివృద్ధి చేయడానికి బిడ్‌లను ఆహ్వానించాయి.
భారతదేశం ఇక్కడను చమురును కనుగొంటే దేశానికి ఎంతో లాభం చేకూరుస్తుందని కొందరు వాదిస్తున్నారు. అయితే ఆయిల్ డ్రిల్లింగ్ వల్ల జీవవైవిధ్యం దెబ్బతింటుందని, తమ జీవనోపాధిపై ప్రభావం పడుతుందని కన్యాకుమారి ప్రాంతంలోని మత్స్యకారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది అర్థం చేసుకోని పరిష్కరించాల్సిన సమస్య.
మత్స్యకారుల అరెస్టులు
కచ్చతీవు విషయానికొస్తే, తమిళనాడు మత్స్యకారులు చాలాసార్లు శ్రీలంక భద్రతా దళాలచే అరెస్ట్ చేయబడతారు. కొన్నిసందర్భాల్లో కాల్పులకు గురై చంపబడతారు. అరెస్ట్ అయిన వారు చాలా వరకు విడుదల చేయబడ్డారు. కానీ సమస్య సమస్యాత్మకమైనది. భారతదేశం, శ్రీలంక పరస్పరం స్నేహపూర్వకంగా ఉన్నందున కచ్చతీవుపై వివాదాన్ని లేవనెత్తడం వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు. పైగా మన జోన్ లోకి ప్రవేశించాలనుకున్న చైనా కు ఇది మరింత సహాయకారీగా ఉంటుంది.
ఇందిరా గాంధీకి అన్యాయం
కచ్చతీవు ఒప్పందం వల్ల నష్టపోయిన భారతీయ మత్స్యకారులను ఎలా ఎదుర్కోవాలనే దానిపై రెండు దేశాల మధ్య కాలానుగుణంగా తాత్కాలిక ఒప్పందాలు జరిగాయి. గతంలో తమిళనాడు ప్రభుత్వాలు, జయలలిత హయాంలో, ఒప్పందాన్ని రద్దు చేయాలని కోర్టుకు వెళ్లిన విజయం సాధించలేదు. అయితే ఈ ఒప్పందంపై రెండు సార్వభౌమ ప్రభుత్వాలు సంతకం చేసినందున మరియు కచ్చతీవు ఎప్పుడూ భారతదేశానికి మాత్రమే చెందినది కానందున, ఇది అన్ని ఆచరణాత్మక ప్రయోజనాల కోసం, న్యాయ సమీక్షకు గురికాబడదు.
1974-76లో కాంగ్రెస్ ప్రభుత్వం కచ్చతీవుపై భారత్‌కు ఉన్న హక్కులను కాంగ్రెస్ స్వచ్ఛంద సంస్థలాగా శ్రీలంకు ధారాదత్తం చేసిందనే ఆరోపణలు అవాస్తవం. ఇది ఇందిరాగాంధీకి దక్కాల్సిన క్రెడిట్ ను తగ్గించడమే అవుతుంది. ఇతర ప్రధాన మంత్రుల లాగానే దేశ ప్రతిష్టను , భద్రతను పెంచడానికి కృషి చేశారు.
బంగ్లాదేశ్, సిక్కిం ఉదాహరణలు
రెండు ఉదాహరణలు చెప్పాలంటే, తూర్పు పాకిస్తాన్ లో జరిగిన అంతర్యుద్దాన్ని వాడుకుని మన దేశం పాకిస్తాన్ ను రెండు విడగొట్టింది. ఆ తూర్పు పాకిస్తానే నేటి బంగ్లాదేశ్. పాకిస్తాన్ అప్పటిలా రెండు వైపులా ఉంటే పరిస్థితి ఎలా ఉండేది. ఇలా మన దేశ అస్థిత్వ ముంపు ను తొలగించడంలో ఇందిరాగాంధీ ధైర్యంగా ముందడుగు వేశారు.
తరువాత, 1975లో, ఒక ముందస్తు చర్యలో, ఇందిరా గాంధీ ప్రభుత్వం అప్పటి స్వతంత్ర రాచరికం-పాలించిన సిక్కింను శాంతియుతంగా, వివాదాస్పదమైనప్పటికీ, ప్రజాభిప్రాయ సేకరణ ద్వారా భారతదేశంలో విలీనం చేసింది. నేటి భౌగోళిక రాజకీయాలలో, సిక్కిం విలీనమై ఉండకపోతే, చైనా అక్కడ పాగా వేసి భారత్ ను ఇబ్బంది పెట్టేదే.
చైనా అంశం
'వాడ్జ్ బ్యాంక్' విషయంలోనూ అదే పరిస్థితి. 1976లో భారతదేశం దానిని తన ప్రత్యేక ఆర్థిక మండలిలోకి చేర్చుకోలేకపోయినట్లయితే, చైనా శ్రీలంకతో తన సంబంధాన్ని ఉపయోగించి అక్కడ చమురు కోసం డ్రిల్లింగ్‌ను ప్రారంభించేందుకు ప్రయత్నించి ఉండేది, లేకుంటే ఆ ప్రాంతంలో భారతదేశ కార్యకలాపాలను సవాలు చేసేది.
వాస్తవానికి, 2022లో, ఒక చైనీస్ కంపెనీ పాక్ జల సంధిలోని మూడు ద్వీపాలలో విండ్ టర్బైన్ ద్వారా విద్యుత్ ఉత్పత్తిని ప్రయత్నించింది. అయితే ఇవీ భారత్ భూభాగానికి దగ్గర ఉండడంతో న్యూఢిల్లీ అభ్యంతరం వ్యక్తం చేసింది. తరువాత ఇదే కాంట్రాక్ట్ ను భారతీయ కంపెనీ తీసుకుంది.
కాబట్టి, భారతదేశం శ్రీలంకతో సముద్ర ఒప్పందంపై సంతకం చేసిన ఐదు దశాబ్దాల తరువాత, దానిలో రంధ్రన్వేషణ చేయడం అవగాహన లేమికి నిదర్శనం.
ఓటర్లను ప్రలోభపెట్టాలనే ఏకైక ఉద్దేశ్యంతో, ఈ సమస్యను తప్పుగా సూచించి, దేశానికి మంచి చేయాలనుకున్న కాంగ్రెస్ ను బదనాం చేయడమే అవుతుంది.
Tags:    

Similar News