బిజెపి నేత అందెల శ్రీరాములు ఇంటి ముందు రెక్కీ

ఆరుగురు రోహ్యింగాలు అరెస్ట్;

Update: 2025-07-04 11:51 GMT

రంగారెడ్డి జిల్లా మహేశ్వరం బిజెపి ఇన్ చార్జి అందెల శ్రీరాములు యాదవ్ ఇంటి ముందు రెక్కీ నిర్వహిస్తున్న ఆరుగురు రోహ్యింగాలను పోలీసులు అరెస్ట్ చేశారు. శ్రీరాములు యాదవ్ ఇంటి ముందు అనుమానాస్పదంగా తిరుగుతున్న ఆరుగురి గూర్చి బిజెపి నాయకులు, కార్యకర్తలు పోలీసులకు ఉఫ్పందించారు. అప్రమత్తమైన పోలీసులు అనుమానాస్పద వ్యక్తులను అరెస్ట్ చేస్తే అసలు విషయం బయటపడింది. రోహ్యింగాల వద్ద మారణాయుధాలు దొరికాయి. అందెల శ్రీరాములు ను హత్య చేయడానికి రోహ్యింగాలు ప్లాన్ చేసినట్టు పోలీసుల ప్రాథమిక విచారణలో బయటపడింది. వారి వద్ద సుత్తి, కటర్, పెట్రోల్ బాటిల్, ఐరన్ రాడ్స్ బాక్స్ లో పెట్టుకుని తిరుగుతున్నారు.

అందెల శ్రీరాములు గత కొన్ని రోజులుగా అందెల శ్రీరాములు రోహ్యింగాలపై ఉద్యమం చేస్తున్నారు.

అందెల శ్రీరాములు ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనకు ప్రాణ హాని ఉందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసినప్పటికీ అనుమానితులను అరెస్ట్ చేయలేకపోయారు.

అయితే శుక్రవారం అందెల శ్రీరాములు ఇంటి ముందు రెక్కీ నిర్వహిస్తున్న రోహ్యింగాలను బిజెపి కార్యకర్తలే పట్టుకోవడానికి ప్రయత్నించారు. అప్రమత్తమైన రోహ్యింగాలు పారిపోవడానికి ప్రయత్నించారు. వాళ్లు ఒక త్రీ వీలర్ బైక్ పై అందెల శ్రీరాములు ఇంటికి వచ్చారని సమాచారం.బైక్ పై ఒక బాక్స్ ఉంది. ఆ బాక్సులోమారణాయుధాలు ఉండటంతో పోలీసులకు అప్పగించారు. రోహ్యింగాల వద్ద నుంచి స్వాధీనం చేసుకున్నవాటిలో మారణాయుధాలే ఉండటంతో పోలీసులు షాక్ అయ్యారు.

రోహ్యింగాలకు బాలాపూర్ అడ్డా

మహేశ్వరం నియోజకవర్గం బాలాపూర్ రోహ్యింగాలకు అడ్డాగా మారింది. వీళ్లు బంగ్లాదేశ్ నుంచి పశ్చిమ బెంగాల్ గుండా హైద్రాబాద్లోకి జొరబడ్డారు. రోహ్యింగాలు బంగ్లాదేశ్ ముస్లింలు. హైద్రాబాద్ ముస్లింలకే సేఫ్ ప్లేస్ కాబట్టి ఇక్కడికి వస్తున్నట్టు తెలుస్తోంది. పాత బస్తీలో మజ్లిస్ పార్టీ గెలుపొందడానికి రోహ్యింగాలు కూడ కారణమౌతున్నారు. వీళ్ల వద్ద ఆధార్ కార్డులు, వోటర్ లిస్ట్ జాబితాలో ఉండటంతో హైద్రాబాద్ లో మజ్లిస్ గెలుపుకు కారణ భూతమౌతున్నారు.

అందెల శ్రీరాములు గత కొంతకాలంగా రోహ్యింగాలపై ఉద్యమిస్తున్నారు. చిన్న చిన్న గుడిసెలు వేసుకుని జీవిస్లున్న రోహ్యింగాలు దొంగతనాలు, దోపిడీలకు పాల్పడుతుంటారు. హత్యలు చేయడం వీరికి మామూలే.హైద్రాబాద్ నేరస్తుల జాబితాలో రోహ్యింగాల పేర్లు కనిపిస్తున్నాయి. బిజెపి ప్రత్యర్థి పార్టీలు కూడా వీరిని ప్రోత్సహిస్తున్నాయి. బిజెపికి హిందూ ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. రోహ్యింగాల వల్ల వోట్లు చీలిపోయి మజ్లిస్ పార్టీకి లాభం చేకూరుతుంది.

Tags:    

Similar News