బెంగళూరులో మెట్రో ఛార్జీల పెంపు.. సీఎం సిద్ధరామయ్యకు నిరసన సెగ

చార్జీల పెంపుతో మెట్రోలో ప్రయాణికుల సంఖ్య తగ్గింది. సోషల్ మీడియాలో సీఎం సిద్ధరామయ్యపై నిరసనలు వెల్లువెత్తగా.. కాంగ్రెస్, బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం మొదలైంది.;

Update: 2025-02-13 12:29 GMT
Click the Play button to listen to article

బెంగళూరు (Bangalore) మెట్రో(Metro) ఛార్జీల పెంపు(Fare hike)పై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. సామాజిక మాధ్యమాల్లో #RollbackMetroFareHike హ్యాష్‌ట్యాగ్‌తో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ప్రయాణికుల సంఖ్య కూడా గణనీయంగా తగ్గింది. ఇటు రాజకీయంగా కాంగ్రెస్-BJP మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఛార్జీలు తగ్గించాలని BMRCL (బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్) ఎండీకి ఆదేశించారు.

ఛార్జీల పెంపుతో తగ్గిన ప్రయాణికులు

ఫిబ్రవరి 10న బెంగళూరు మెట్రో (నమ్మ మెట్రో) టికెట్ ధరలు సగటున 51.5% పెంచినట్లు బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (BMRCL) ప్రకటించింది.

సాధారణంగా 8.5-9 లక్షల మంది ఉపయోగించే మెట్రో ఇప్పుడు కేవలం 7.78 లక్షల మందికే పరిమితమైంది. ఫిబ్రవరి 10న 8.28 లక్షల మంది మాత్రమే ప్రయాణించారు. ఇది సాధారణం కంటే 6% తక్కువ. ఫిబ్రవరి 11న 7,78,774 మంది మాత్రమే మెట్రో లో ప్రయాణం చేశారు. ఇది కూడా సాధారణం కంటే 10% తక్కువ.

సామాజిక మాధ్యమాల్లో నిరసనలు

మెట్రో ఛార్జీల పెంపుపై ప్రయాణికులు నిరసిస్తున్నారు. RollbackMetroFareHike అనే హ్యాష్‌ట్యాగ్‌తో సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. "ప్రజా రవాణాను ప్రోత్సహించాల్సిన ప్రభుత్వం ఛార్జీలు పెంచడం అన్యాయం’’. "మెట్రో సామాన్య ప్రజల ప్రయాణ సాధనం. ఛార్జీలు పెంచడం దౌర్జన్యం." "పెంచిన ఛార్జీల కారణంగా మెట్రో ఉపయోగించేవారు తగ్గిపోతున్నారు. ఇలా అయితే తిరిగి ప్రైవేట్ వాహనాలపైనే ప్రజలు మొగ్గుచూపుతారు." అని ట్వీట్లు చేశారు.

Congress, BJP మధ్య మాటల యుద్ధం..

మెట్రో ఛార్జీల పెంపు కారణంగా కాంగ్రెస్-BJP మధ్య మాటల యుద్ధం మొదలైంది. మెట్రో ఛార్జీల పెంపునకు కాంగ్రెస్ ప్రభుత్వమే బాధ్యత వహించాలని విపక్షం ఆరోపించింది. "సిద్ధరామయ్య (CM Siddaramaiah) సర్కారు టికెట్ ధరలు పెంచి ప్రజలకు ఇంకాస్త ఆర్థిక భారం మోపింది, " అని బీజేపీ నాయకులు విమర్శించారు.

సమర్థించుకున్న సీఎం

ఇది కేంద్రం తీసుకున్ననిర్ణయం అని కాంగ్రెస్ స్పష్టం చేసింది. "మెట్రో ఛార్జీల పెంపులో కర్ణాటక ప్రభుత్వానికి ఎలాంటి పాత్ర లేదు. ఇది కేంద్రం నిర్ణయం మాత్రమే. బీజేపీ ప్రజలను తప్పుదారి పట్టిస్తోంది," అని సీఎం సిద్ధరామయ్య తెలిపారు. మరింత స్పష్టత కోసం ఆయన ఎక్స్‌ వేదికగా రెండు పేజీల లేఖను పోస్టు చేశారు.


మెట్రో ఛార్జీల పెంపుపై తీవ్ర వ్యతిరేకత రావడంతో చార్జీ తగ్గించాలని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య BMRCL ఎండీని ఆదేశించారు. "BMRCL ఛార్జీలను అసమంజసంగా పెంచింది. కొన్ని మార్గాల్లో రెట్టింపు అయ్యింది. ప్రయాణికుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని, ఈ పెరుగుదల తక్షణమే వెనక్కుతీసుకోవాలి," అని ఆదేశించారు. మరోవైపు"మెట్రో ఛార్జీలు పెంచే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని, కేంద్ర ప్రభుత్వం నియమించిన కమిటీ నిర్ణయం తీసుకుంటుందని" స్పష్టం చేశారు.

మెట్రో ఛార్జీల పెంపుతో ప్రజా రవాణా ఖరీదయిపోయింది. ఆటో, క్యాబ్, ప్రైవేట్ వాహనాలతో పోలిస్తే మెట్రో ప్రయాణమే ఖరీదుగా కనిపిస్తుంది. 

Tags:    

Similar News