‘జైలుకు అయినా వెళ్తాను కానీ.. ఇంటికి మాత్రం రాను’

బెంగళూర్ కు చెందిన ఓ టెకీ కనిపించడం లేదని అతని భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. చివరకు పోలీసులు నానా అవస్థలు పడి అతడిని పట్టుకోగా.. నేను ఇంటికి రానంటూ..

Update: 2024-08-17 09:56 GMT

జైలుకైయినా వెళ్తాను కానీ.. ఇంటికి మాత్రం వెళ్లనని ఓ సాప్ట్ వేర్ ఇంజనీర్ పోలీసులను వేడుకున్నాడు. తన భార్య నిత్యం వేధిస్తుందని, ఆ బాధ భరించలేక ఇంటి నుంచి వెళ్లిపోయానని తన బాధను పోలీసులకు వెళ్లబోసుకున్నాడు.

వివరాల్లోకి వెళితే.. బెంగళూర్ కు చెందిన ఓ టెకీ తన భార్య పెట్టే హింసను భరించలేక ఇల్లు విడిచి పారిపోయాడు. వారం రోజులగా అతని ఆచూకీ లేకపోవడంతో అతని భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. చివరకు పోలీసులు అతడిని ఉత్తర ప్రదేశ్ లోని నోయిడా లో గుర్తించారు.

పోలీసులు అక్కడికి చేరుకుని అతడిని ఇంటికి తీసుకెళ్లడానికి ప్రయత్నించగా అతడు ఎదురు తిరిగాడు.. తనను ఇక్కడే జైలులో పెట్టండని.. కానీ బెంగళూర్ మాత్రం రానని మొండికేశాడు. కానీ పోలీసులు మాత్రం బలవంతంగా బెంగళూర్ తీసుకొచ్చారు.

అతని భార్య తెలిపిన వివరాలు ప్రకారం.. ఆగష్టు 4 నుంచి ఆయన కనిపించడం లేదు. ఏటీఎం కు వెళ్తానని చెప్పి ఇంటి నుంచి బయటకు వెళ్లారు. తరువాత ఇంటికి తిరిగి రాలేదు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే పోలీసులు ఆయన ఆచూకీ కనుగొనడంలో విఫలం అయ్యారు. దీనిపై బాధితురాలు పోలీసులు సరిగా స్పందించడం లేదని సోషల్ మీడియాలో పోస్టు చేసింది.
ఫోన్ స్విచ్ ఆఫ్..
తప్పిపోయిన భర్త ఫోన్ స్విచ్ఛాఫ్ చేయడంతో పోలీసులకు ఆచూకీ లభించలేదు. విమానాశ్రయం, రైల్వే స్టేషన్లు, బస్టాండ్‌లలో వందలాది సీసీటీవీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించినా ఫలితం లేకపోయింది. చివరగా, టెక్కీ కొత్త సిమ్ కార్డును కొనుగోలు చేసి, అతని పాత ఫోన్‌లో వేశాడు.
ఇది నోయిడాలో ఉన్న అతనిని ట్రాక్ చేయడానికి పోలీసులకు వీలు కల్పించింది. నోయిడాలోని ఒక మాల్ నుంచి సినిమా చూసి బయటకు వస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. పోలీసులు అప్పుడు సివిల్ దుస్తులు ధరించి ఉన్నారు. ఇరువురి మధ్య వాదోపవాదాలు జరిగాయి. తరువాత అతడు పోలీసులను గుర్తించి తరువాత ఏంటీ? అని అడిగాడు. పోలీసులు బెంగళూర్ రమ్మని కోరగా, తాను నిరాకరించాడు.
'నన్ను జైలులో పెట్టండి, నేను అక్కడే జీవిస్తాను'
"మీరు నన్ను జైలులో పెట్టండి, నేను అక్కడ నివసిస్తాను ... కానీ నేను బెంగళూరుకు తిరిగి రాను" అని అతను వారికి పదేపదే చెప్పాడు. మిస్సింగ్ కేసును బెంగళూర్ లోనే పరిష్కరించాలని చెప్పడంతో ఎలాగో అలా అంగీకరించాడు. తరువాత అతని వాంగ్మూలం తీసుకుని ఇంటికి వెళ్లడానికి అంగీకరించారు.
తన భార్య తనను వేధిస్తున్నదని టెక్కీ పోలీసులకు తెలిపాడు. అతను ఆమెకు రెండవ భర్త అని సమాచారం. అతను 3 సంవత్సరాల క్రితం ఆమెను కలిసినప్పుడు ఆమె 12 ఏళ్ల కుమార్తెతో విడాకులు తీసుకుంది. అతను బ్రహ్మచారి, ఆమెను వివాహం చేసుకున్నాడు. వారికి 8 నెలల కుమార్తె ఉంది.
భార్య అతని స్వేచ్ఛను..
తన భార్య తన స్వేచ్ఛను హరించిందని, బట్టలు ధరించడంలో కూడా తన వాదనను నెగ్గించుకోవడానికి ప్రయత్నిస్తుందని వివరించాడు. ప్లేట్ లో అన్నం ఎక్కువై పడేసిన అరుపులతో ధడిపిస్తుందని పేర్కొన్నాడు. బయట కనీసం ఒక కప్పు కాఫీ, టీ కూడా ఆస్వాదించడానికి అనుమతి ఇవ్వదని పోలీసులకు చెప్పాడు.
వేధింపులకు తట్టుకోలేక నోయిడా పారిపోవాలని నిర్ణయించుకున్నాడు. అతను కనిపించడం లేదని అతని భార్య తన ఫోటోలను ఆన్‌లైన్‌లో పోస్ట్ చేయడంతో, టెక్కీ తల షేవ్ చేసి అతని రూపాన్ని మార్చుకున్నాడు.
బస్సులో తిరుపతికి వెళ్లి, రైలులో భువనేశ్వర్‌కు వెళ్లి, అక్కడ నుండి ఢిల్లీకి వెళ్లి చివరకు నోయిడాలో దిగాడు. నోయిడాలోని మాల్‌లో పోలీసులు అతనిని ట్రాక్ చేసే దాక కొనసాగిన అతని స్వేచ్ఛ తరువాత ఇలా ఇంటికి చేరింది.
Tags:    

Similar News