రామేశ్వరం కెఫె: అనుమానితుడు 10.45 AMకీ..

రామేశ్వరం కెఫెలో పేలుడుకు పాల్పడినట్లు భావిస్తున్న అనుమానితుడి అదనపు సమాచారం సీసీటీవీ ఫుటేజీల్లోదొరికినట్లు తెలుస్తోంది. ఒక దగ్గర తన క్యాప్ తీసినట్లు..

Update: 2024-03-07 07:44 GMT

భారత ఐటీ రాజధాని బెంగళూర్ లోని సుప్రసిద్ద రామేశ్వరం కెఫెలో జరిగిన బాంబు పేలుళ్ల జాతీయ దర్యాప్తు సంస్థ విచారణను వేగవంతం చేసింది. అనుమానితుడి కదలికలను సంబంధించిన కీలక సీసీటీవీ ఫుటేజీని సంపాదించినట్లు జాతీయ మీడియా వార్తలు ప్రచురించాయి. బాంబు పేలుడుకు ముందు జరిగిన కొన్ని సీసీ కెమెరాల్లోని రికార్డుల ప్రకారం..

తలకు టోపీ, కళ్లకు అద్దాలు, ముఖానికి మాస్క్, చేతిలో బ్యాగ్ తో ఉన్న వ్యక్తి ఉదయం 10.45 గంటలకు కెఫె కి 100 మీటర్ల దూరంలో ఉన్న బస్టాప్ వద్ద పబ్లిక్ బస్సు దిగాడు.
అతను 11.34 గంటలకు కెఫెలోకి ప్రవేశించి, 11.43 కి రెస్టారెంట్ నుంచి బయటకు వచ్చాడు.
తరువాత మరో పబ్లిక్ బస్సులో ఎక్కడానికి కిలోమీటర్ దూరంలో ఉన్న బస్టాప్ కు నడుచుకుంటూ వెళ్లాడు.
మధ్యాహ్నం 12.56 గంటలకు పేలుడు సంభవించింది.
సీసీ ఫుటేజీలను పరిశీలిస్తే.. నేరానికి పాల్పడ డానికి ముందు అనేక బస్సులు మారినట్లు తెలుస్తోంది.
అనుమానితుడు తప్పించుకునే సమయంలో కెఫెకి కొన్ని కిలో మీటర్ల దూరంలో ఉన్న ముస్లిం మత కేంద్రంతో సహ పలు స్టాప్ లు మారాడని తెలుస్తోంది. ఒక స్టాప్ ఓవర్ లో తన తలపై ధరించిన బేస్ బాల్ క్యాప్ ను
పెట్టుకోలేదని
తెలిసింది.
ఐఈడీ ప్రభావం ఎందుకు తగ్గింది
బెంగళూర్ లోని రామేశ్వరం కెఫెలో జరిగింది తక్కువ తీవ్రత గల పేలుడు కాదని, ఉగ్రవాదులు ఉంచిన ప్రదేశమే పేలుడు తీవ్రత తగ్గడానికి సహాయపడిందని తాజాగా నిర్థారణ అయింది. పేలుడు పదార్థం ఉన్న బ్యాగు హ్యాండ్ వాష్ దగ్గర పెట్టాడని, అక్కడ ఉన్న చెట్లు, గోడ ఉండడంతో బాంబులో ఉన్న నట్లు, బోల్టులు భారీగా విచ్చిన్నం కాలేదని దర్యాప్తు అధికారులు గుర్తించారు. దీని వల్ల పెను ప్రమాదం తప్పిందని అధికారులు అంటున్నారు.
బాంబును టిఫిన్ బాక్స్ లో ఉంచి, పీచు పదార్థం దాని చుట్టూ పెట్టినట్లు తేలింది. ఇందులో సల్ఫర్, పోటాషియం నైట్రేట్, సులభంగా లభించే ఇంకా కొన్ని పేలుడు పదార్థాలు ఉన్నాయి. కొన్ని సోర్స్ ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం.. డిజిటల్ టైమర్ ద్వారా స్విచ్ దానికి అనుసంధానించిన బల్భ్ ఫిలమెంట్స్ ద్వారా ఐఈడీ పేలింది.
ఇందులో ఉపయోగించిన ట్రిగ్గర్ మెకానిజం 2022 లో కర్నాటకలో జరిగిన మరో రెండు ఉగ్రవాద ఘటనలో ఉపయోగించిన మాదిరిగానే ఉందని ఇవన్నీ ఇస్లామిక్ టెర్రరిస్ట్ లు సాధారణంగా వాడేవని ఎన్ఐఏ గుర్తించింది.
రూ. 10 లక్షల బహుమానం
రామేశ్వరం కెఫెలో బాంబు దాడికి పాల్పడిన అనుమానితుడి ఫొటోలను జాతీయ దర్యాప్తు సంస్థ విడుదల చేసింది. అనుమానితుడి వివరాలు అందిస్తే రూ. 10 అందిస్తామని ప్రకటించింది. వివరాలు అందించిన వారి సమాచారం గోప్యంగా ఉంచుతామని హమీ ఇచ్చింది. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న ఎన్ఐఏ సామాజిక మాధ్యమం ఎక్స్ లో దీనికి సంబంధించిన వివరాలను పోస్ట్ చేసింది. అలాగే కొన్ని ఫోన్ నెంబర్లు, ఈ మెయిల్ ఐడీని కూడా పోస్ట్ చేసింది.


Tags:    

Similar News