కోజికోడ్‌లోనే ఎయిమ్స్.. కేరళలో ఆ ఇద్థరి నేతల మధ్య మాటల యుద్ధం..
కేరళలో ఎయిమ్స్ ఏర్పాటుకు కేంద్రం అంగీకరించింది. కోజికోడ్‌లోని కినాలూర్‌లో ఆసుప్రతి ఏర్పాటుకు కేంద్రం ఆమోదించిందని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ రాష్ట్ర అసెంబ్లీకి సమాచారం ఇచ్చారు.
కేరళలో ఎయిమ్స్ ఏర్పాటుకు కేంద్రం అంగీకరించింది. కోజికోడ్‌లోని కినాలూర్‌లో ఆసుప్రతి ఏర్పాటుకు కేంద్రం ఆమోదించిందని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ రాష్ట్ర అసెంబ్లీకి సమాచారం ఇచ్చారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్, బీజేపీ నేత రాజీవ్ చంద్రశేఖర్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఆదివారం సోషల్ మీడియా పోస్ట్‌లో..‘‘ఏ ఎంపీ కూడా తనకు నచ్చిన చోట ఆసుప్రతి ఏర్పాటు చేయిస్తామని హామీ ఇవ్వరు. తిరువనంతపురం నియోజకవర్గంలో ఎయిమ్స్ ఏర్పాటుకు నేను చాలా ప్రయత్నించా..కాని కోజికోడ్ జిల్లాలో ఏర్పాటు చేసేందుకే కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది’’ అని థరూర్ పోస్టు చేశారు.
థరూర్ ట్వీట్‌పై బీజేపీ ఎంపీ రాజీవ్ చంద్రశేఖర్ స్పందించారు. తిరువనంతపురం నుంచి 15 ఏళ్లుగా ప్రాతినిధ్యం వహిస్తున్న కాంగ్రెస్ ఎంపీ తన వాగ్దానాలలో ఏ ఒక్కటీ నిలబెట్టుకోలేదని రీట్వీట్ చేశారు.
2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు తిరువనంతపురం స్థానానికి ఎన్‌డిఎ అభ్యర్థి రాజీవ్ చంద్రశేఖర్ ఎంపీగా ఎన్నికైన తర్వాత నియోజకవర్గానికి ఎయిమ్స్‌ను తీసుకురావడానికి అన్ని ప్రయత్నాలు చేస్తానని హామీ ఇచ్చారు. నెక్ అండ్ నెక్ ఫైట్ తర్వాత, కాంగ్రెస్ అభ్యర్థి శశి థరూర్ తిరువనంతపురం లోక్‌సభ స్థానం నుంచి బీజేపీకి చెందిన రాజీవ్ చంద్రశేఖర్‌పై రికార్డు స్థాయిలో నాలుగోసారి విజయం సాధించారు.