లొంగిపోయిన 86మంది మావోలు
పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో ఆపరేషన్ చేయూత. ఐజీపీ ఎందుట లొంగిపోయిన మావోలు. అందరికీ రూ.25వేల చెక్కు అందించిన అధికారి.;
భారతదేశాన్ని నక్సల్స్ ఫ్రీగా మార్చడం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ఆపరేషన్ చేస్తోంది. ఇందులో భాగంగానే భద్రాద్రి కొత్తగూడెంలో పోలీసులు ఆపరేషన్ చేయూత కూడా చేపట్టారు. దీని కింద లొంగిపోయిన మావోయిస్టులకు జనజీవనస్రవంతిలో కలవడానికి అవకాశం కల్పించడంతో పాటు, వారికి రూ.25వేల ఆర్థిక సహాయాన్ని కూడా అందిస్తారు. శనివారం కొత్తగూడెం పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో ఆపరేషన్ చేయూత కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంటా మల్టీ జోన్ -1 ఐజీపీ చంద్రశేఖర్ రెడ్డి ఎదుట 86 మంది మావోయిస్టులు లొంగిపోయారు. బీజాపూర్ జిల్లా, సుఖ్మ జిల్లా సభ్యులు లొంగిపోయారు. మావోయిస్టు పార్టీ పేరుతో బలవంతపు వసూళ్లు అపాలని పోలీసులు నిర్ణయించారు.. ఆదివాసీ ప్రాంతాల అభివృద్ధికి అడ్డంకిగా మారడంతో పోలీసులు ప్రత్యేక ఆపరేషన్ చేపట్టారు. గత నాలుగు నెలల్లో మావోయిస్టులు లొంగిపోవడం భారీగా జరిగింది. ఇప్పటి వరకు 203 మంది లొంగిపోగా, 63 మంది అరెస్ట్ అయ్యారు. ఈ నేపథ్యంలో భద్రాద్రి కొత్తగూడెంలో శనివారం 86 మంది లొంగిపోగా వారిలో 20 మంది మహిళలు, 66 మంది పురుషులు ఉన్నారు. ప్రతి మావోయిస్టుకు పోలీసులు రూ.25వేల చెక్కును అందించారు.