ఏఐ వీడియోల షేరింగ్, సినీనటి దియా మీర్జాపై చర్యలు

కంచె గచ్చిబౌలిలో చెట్ల నరికివేత పేరిట ఏఐ క్లిప్ లను పంచుకున్న కేసులో సినీనటి దియామీర్జా, యూట్యూబర్ ధ్రువ్ రాఠీలపై తెలంగాణ సర్కార్ చట్టపరంగా చర్యలు తీసుకోనుంది.;

Update: 2025-04-07 16:49 GMT
సినీనటి దియామీర్జా

కంచె గచ్చిబౌలిలో చెట్ల నరికివేత పేరిట ఆర్టిఫిషల్ ఇంటలిజెన్స్ (ఏఐ)క్లిప్ లను పంచుకున్న కేసులో సినీనటి దియామీర్జా, యూట్యూబర్ ధ్రువ్ రాఠీలపై చట్టపరంగా చర్యలు తీసుకకోవాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కంచ గచ్చిబౌలి సమస్యపై ఏఐ జనరేటెడ్ కంటెట్ పై రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది.


సీఎం రేవంత్ రెడ్డి ఆదేశంతో...
కంచె గచ్చిబౌలిలోని 400 ఎకరాల్లో భూమిని చదును చేస్తుండగా బుల్డోజర్లను చూసి జింకలు, నెమళ్లు పారిపోయినట్లు కృత్రిమ మేధ సాయంతో నకిలీ వీడియోలు, ఆడియో క్లిప్పింగులు సృష్టించారని,వీటిని ప్రచారం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం హైకోర్టును కోరింది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆదేశంతో ప్రభుత్వం ఏఐ జనరేటెడ్ విజువల్స్ పై కోర్టు ద్వారా చర్యలకు ఉపక్రమించింది.

దియామీర్జా ఎం పోస్టు చేశారంటే...
కంచె గచ్చిబౌలి భూముల వివాదంపై సుప్రీంకోర్టు, హైకోర్టులోనూ విచారణలు జరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఏఐ జనరేటెడ్ వీడియోలను తీవ్రంగా పరిగణించింది. చెట్ల నరికివేత దృశ్యాలను పంచుకున్న సినీనటి దియా మీర్జా ఏఐ జనరేటెడ్ కంటెంట్ పై సీఎం వ్యాఖ్యలపై ‘‘చెట్లు కూడా నకిలీవా’’అని ప్రశ్నించారు. పర్యావరణానికి నష్టం జరుగుతుందని వీడియోను యూట్యూబర్ ధ్రువ్ రాఠీ పోస్టు చేశారు. **తెలంగాణ ముఖ్యమంత్రి నిన్న ఒక ట్వీట్ పోస్ట్ చేశారు. కంచ గచ్చిబౌలి పరిస్థితి గురించి ఆయన కొన్ని వాదనలు చేశారు.వాటిలో ఒకటి, ప్రభుత్వం వేలం వేయాలనుకున్న 400 ఎకరాల భూమిపై జీవవైవిధ్యాన్ని కాపాడాలని విద్యార్థులు చేసిన నిరసనకు మద్దతుగా నేను నకిలీ ఏఐ రూపొందించిన చిత్రాలు/వీడియోలను ఉపయోగించాను.ఇది పూర్తిగా తప్పుడు ప్రకటన. ఏఐ రూపొందించిన ఒక్క చిత్రం లేదా వీడియోను నేను పోస్ట్ చేయలేదు’’అని దియామీర్జా పేర్కొన్నారు.

మన్నె క్రిశాంక్ కు నోటీసులు

కంచె గచ్చిబౌలి భూముల్లో ఏఐను ఉపయోగించి వీడియోలు రూపొందించి సోషల్ మీడియాలో పోస్టు చేసినందుకు బీఆర్ఎస్ నాయకుడు మన్నె క్రిశాంక్ కు గచ్చిబౌలి పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 9,10.11 తేదీల్లో గచ్చిబౌలి పోలీసుస్టేషనులో విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు.ఏఐ వీడియోలు పోస్టు చేయడంపై పోలీసులు ఇప్పటికే కేసు నమోదు చేశారు.



Tags:    

Similar News