'జగిత్యాల జైత్రయాత్ర' నిర్మాత నారాయణ సార్ ఇక లేరు
ఆయన అమర వీరుల జాబితాలో లేక పోవచ్చు. నాటి పీపుల్స్ వార్ పార్టీకి తొలి బీజాలు వేసి చరిత్ర సృష్టించిన కార్యకర్త ఆయనే అంటున్నారు ప్రముఖ రచయిత బిఎస్ రాములు;
ఆయన జగిత్యాల జైత్రయాత్ర యాత్ర నిర్మాతల్లో ఒకరు. ఆయనను అందరు నారాయణ సార్ అని పిలుస్తారు. ఉద్యమంలో, జైలు లోపల కూడా సిద్దాంత అధ్యయన తరగతులు చెప్పడంతో ఆయన్ని అందరు ారాయణ సార్ అని పిలుస్తారు. ఆయన ది కోరుట్ల సమీపంలోని కల్లూరు గ్రామం పక్కన గల పల్లె. దాన్ని పల్లె అని పిలుస్తారు. . అందువల్ల పల్లెమీది నారాయణ, కల్లూరు నారాయణ అని కూడా పిలుస్తారు. ఆయన పూర్తిపేరు పండుగ నారాయణ. ఆ పల్లె పేరు సర్పరాజ్ పల్లె అని ఎవరికీ పెద్దగా తెలియదు. వారి మృతికి తీవ్ర సంతాపం. వారి కుటుంబానికి సానుభూతి తెలియజేస్తున్నాను.
నారాయణ ప్రజల మనిషి
కరీంనగర్ జిల్లాలో ఎదిగి వచ్చిన తొలి తరం నక్సలైట్ నాయకులలో నారాయణ సార్ ఒకరు. మూడు నెలలుగా లివర్ అన్న వాహిక వద్ద ఏర్పడిన కంతితో, జాండిస్ వ్యాధితో జీర్ణవ్యవస్థ వ్యవస్థకు అడ్డు పడి ఆపరేషన్ అయ్యి కోలుకున్నారు తిరిగి లీక్ కావడం తో మేనెల 15 వతేదీ గురువారం అర్ధరాత్రి తరువాత తుది శ్వాస విడిచారు. వారికి భార్య ఒక కొడుకు ఒక బిడ్డ. 1968 లో పయూసి చేసిన నారాయణ కొంత కాలం ప్రయివేటు బడి నడిపారు. ఆ వెంటనే ఉద్యమంలో ేరారు. ఆయన వయస్సు 75 ఏళ్లు . ఈ రోజు ుక్రవారం 16 మధ్యాహ్నం అంత్య క్రియలు .
పి నారాయణ చరిత్ర నిర్మాత
పి నారాయణ సార్ ఒక చరిత్ర నిర్మాత. నక్సలైట్ ఉద్యమం తొలి స్థానిక తొలి నాయకత్వంగా ప్రసిద్ది చెందారు. పల్లెల్లో వేలాది పల్లె వాసుల్లో విద్యావంతుల్లో , పౌరహక్కుల ఉద్యమ నిర్మాతల్లో వారి జ్ఞాపకాలు , చేసిన ఉద్యమాల జ్ఞాపకాలు చెరిగి పోనివి. ఆయన అడుగు జాడలలో నడిచిన రైతుకూలీ లు, యువతరం వారి ధైర్యాన్ని చూసిన ప్రజలు భూస్వాములు , ఉద్యమ సీనియర్ నాయకత్వం మరిచి పోలేరు.
వర్గ శతృ నిర్మూలనతో ప్రారంభించి...
పండుగ నారాయణ సార్ వర్గ శతృ నిర్మూలనతో అనేక సంఘటనల్లో ప్రత్యక్ష గా పరోక్షంగా పాల్గొనడం .. మొదలు కొని ఎమర్జెన్నీలో రహస్య జీవితం గడిపి ఎమర్జెన్సీ తరువాత జనతా పార్టీ కేంద్రం లో అధికారంలోకి రావడం తో బహిరంగ ప్రజా ఉద్యమాల నిర్మాణం లో తల మునకలయ్యారు. విద్యార్థుల యువకుల విలేజ్ క్యాంపెయిన్ తో జగిత్యాల పల్లెలు భూస్వాములకు వ్యతిరేకంగా కదిల బారాయి. 1978 జులై 17 ఏర్పాటు చేసిన రైతుకూలీ సంఘం మహాసభ జగిత్యాల జైత్రయాత్ర గా ప్రసిద్ది పొందింది. దాని వెనక ఉన్న నిర్మాతల్లో పి నారాయణ ప్రముఖులు. జగిత్యాల జైత్రయాత్ర యాత్రతో జగిత్యాల సిరిసిల్ల తాలూకా లు కల్లోలిత ప్రాంతాలుగా ప్రకటింప బడ్డాయి.
నాకు స్పూర్తి నిచ్చిన వాడు
నేను విప్లవోద్యమంలోకి రావడానికి స్పూర్తి నిచ్చిన పి నారాయణ మా చినమామ అల్లుడు. సడ్డకుడుగా పరిచయం. మా శ్యామల మేనత్త కొడుకు. మాకు 1973 లో పెళ్లయ్యాక సెలవుల్లో నారాయణ తో అనేక చర్చలు జరిగాయి. అలా భూస్వామ్య వ్యతిరేక ఉద్యమాల పట్ల ఆకర్షితుడినయ్యాను. పౌరహక్కుల నాయకుడు జాప్ లక్ష్మా రెడ్డి గారు నారాయణ సాహసాలను శతృవు నుండి తృటిలో తప్పించుకున్న సంఘటనలను చెప్పి ప్రశంసిస్తుంటే వాడు.
నారాయణ వాస్తవికత దృష్టి
జగిత్యాల జగిత్యాల జైత్రయాత్ర జరిగిన ఉత్సాహం తో పార్టీ అగ్ర నాయకులు ఉత్తర తెలంగాణ, అటుతర్వాత దండకారణ్యం గెరిల్లా జోన్ ప్రతి పారించారు. నారాయణ పల్లెలో పుట్టి పల్లెలో పెరిగాడు. నారాయణ గారిది వాస్తవిక దృష్టి. దొరలు గుంజుతున్న భూములతో సహా భూములు ఇప్పిస్తామని జగిత్యాల సభకు రమ్మని పిలుపు విని వచ్చిన రైతుకూలీలు వారు. అందువల్ల ప్రజల చైతన్యంలో అంత సీన్ లేదని, భూములు పంచుతామంటే ఆశతో వచ్చిన ప్రజలని స్థానిక ఎన్నికల్లో పాల్గొని మన శక్తి బలం సమకూర్చుకోవాసని ఆశించారు.
అందుకు ా పెద్దమామ చెన్న రాజ గంగారాం నాయకత్వంలో 1962 లో సాగించిన ఉద్యమాలతో ఊరి దొర పారి పోయి అదిలాబాద్ లో స్థిరపడి అక్కడే చనిపోయాడని గొప్ప పోరాట స్పూర్తి. ఆ కాలంలోనే దొరల ు ఎదిరించి ఒక బీసీని సర్పంచ్ గా ఎన్నుకున్నారు. ఇలానే పల్లెలన్నిటా ఈ సామాజిక పరిణామాలు, స్థానిక అధికార మార్పిడి జరగాలని నారాయణ గారుపార్టీ ముందుంచారు. పార్టీ అగ్ర నాయకత్వం స్థానికేతర నాయకత్వం. ఈ చరిత్ర పరిణామం అర్థం చేసుకోలేదు . వారు గెరిల్లా జోన్ , ఎన్నికల బహిష్కరణ లకు ప్రాధాన్యత నిచ్చారు.. భిన్నాభిప్రాయాలు గల నారాయణ సీనియారిటీ ను కాదని ఇతరులకు నాయకత్వం అప్పగించడంతో కినుక వహించారు. అనేక కేసుల కారణంగా జైలు జీవితం గడిపి 1984 ఫిబ్రవరి లో బయటకు వచ్చారు.
పార్టీ వదిలినా పాత పగలు పోలేదు.
పార్టీ వదిలినా కేసులు కొట్టేసినా భూస్వాముల పాత పగలు పోలేదు. ఎపుడు ఎవరు చంపుతారో తెలియదు. రహస్య జీవితమే అనివార్యం అయింది. కుటుంబం ను తీసుకొని నారాయణ హైదరాబాద్ చేరుకున్నారు. సిటీ బస్ కండక్టర్ గా కుశాయి గూడ బస్ డిరోలో మూడో నెంబర్ రూట్ పై పని చేసి రిటర్ అయ్యారు.
తిరిగి పల్లెకు చేరిన నారాయణ కుటుంబం
సిటీలో ఉండి సాధించింది లేదు. సంపాదించింది లేదు అని కొన్నాళ్లకు తిరిగి స్వంత ఊరుకు చేరుకున్నారు. ఆయన ఉద్యమాన్ని వదిలినా , ఆయన ఆశయాలకు భిన్నంగా ఉద్యమం సాగినా ఆయనపై భూస్వామ్య, పాలక వర్గాల నిర్బంధాలు కొన సాగుతూనే వచ్చాయి.
జగిత్యాల జైత్ర యాత్ర చరిత్రలో నిలిచి వున్నంత కాలం ఆయన పేరు నిలిచి వుంటుంది. ఆయన అమర వీరుల జాబితాలో లేక పోవచ్చు. కాని నేటి పీపుల్స్ వార్ మావోయిస్టు పార్టీకి తొలి విత్తనాలు వేసి చరిత్ర సృష్టించిన కార్య కర్తగా నాయకుడిగా నారాయణను చరిత్ర గుర్తుంచుకుంటుంది. నారాయణ గారు అనుకున్న
. తీరులో ఉద్యమాలు సాగితే గ్రామ స్వరాజ్యం, స్థానిక పాలన , బహుజన సామాజిక అొదికార మార్పిడి ఎపుడో జరిగి వుండేదని ఆయన అభిమానులు ఇప్పటికీ భావిస్తుంటారు. స్థానిక పరిస్థితులు తెలియని స్థానికేతర నాయకత్వం వల్ల తెలంగాణ దశాబ్దాలుగా నిర్బంధాల కింద నలిగి పోయిందని కొందరు సీనియర్లు భావిస్తుంటారు.
తనదైన చరిత్ర నిలుపుకున్న స్వంత ఆలోచనలు స్వంత వ్యక్తిత్వం గల పి నారాయణ సార్ జగిత్యాల జైత్రయాత్ర చరిత్రలో ఉన్నంత కాలం చరిత్రలో నిలిచి వుంటారు.