సింగర్ మంగ్లీపై కేసు నమోదు..

పార్టీలో విదేశీ మద్యాన్ని కూడా అధికారులు గుర్తించారు.;

Update: 2025-06-11 07:09 GMT

సింగర్ మంగ్లీ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఎన్నో పాటలతో విశేష అభిమానులను కూడబెట్టుకుంది. తాజాగా ఆమెపై ఓ కేసు నమోదయింది. తగిన అనుమతులు లేకుండా ఆమె బర్త్‌డే పార్టీ నిర్వహించారు. తన పుట్టినరోజు సందర్భంగా మంగళవారం రాత్రి చేవెళ్ల త్రిపుర రిసార్ట్‌లో తన స్నేహితులకు పార్టీ ఇచ్చిందామే. ఈ పార్టీకి అనేక మంది ప్రముఖులు హాజరయ్యారు. ఈ విషయం తెలియడంతో పోలీసులు వెళ్లి ఆరా తీశారు. పార్టీకి అనుమతులు లేవని తెలియడంతో సోదాలు చేశారు. ఈ తనిఖీల్లో దామోదర్ అనే వ్యక్తి గంజాయి తీసుకుంటూ పట్టుబడ్డాడు. అంతేకాకుండా ఆమె పార్టీలో విదేశీ మద్యాన్ని కూడా అధికారులు గుర్తించారు. అంతేకాకుండా హెవీ సౌండ్‌తో డీజే కూడా ప్లే చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అనుమతులు లేకుండా పార్టీ నిర్వహించడంతో మంగ్లీపై పోలీసులు కేసులు నమోదు చేశారు.

Tags:    

Similar News