అమరవీరుల కుటుంబాలకు రూ.కోటి పరిహారం: సీఎం రేవంత్

పోలీసు ఉద్యోగం చేయడం చాలా మందికి ప్యాషన్‌గా ఉంటుంది. మరికొందరు ఈ యూనిఫామ్ వేసుకోవడాన్ని పవర్‌గా కూడా ఫీలవుతారు.

Update: 2024-10-21 07:53 GMT

పోలీసు ఉద్యోగం చేయడం చాలా మందికి ప్యాషన్‌గా ఉంటుంది. మరికొందరు ఈ యూనిఫామ్ వేసుకోవడాన్ని పవర్‌గా కూడా ఫీలవుతారు. కానీ ఒక్కసారి ఖాకీ యూనిఫామ్ ఒంటిమీద పడిందంటే ప్రతి ఒక్కరిలో బాధ్యత తప్పకుండా ఉంటుంది. అప్పటి వరకు సమాజంపై కనిపించని బాధ్యత.. ఖాకీ బట్టలు వేసుకోగానే వచ్చేస్తుంది. ఆ బాధ్యత తీసుకొచ్చే తెగింపో, గుండె ధైర్యమో కానీ సమాజం కోసం ప్రాణాలు పణంగా పెట్టడానికి కూడా వెనకాడవు ఈ ఖాకీలు. అలా విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన వారిని స్పరించుకుంటూ తెలంగాణ ప్రభుత్వం ఈరోజు హైదరాబాద్‌లోని గోషామాల్‌ స్టేడియంలో నిర్వహించిన పోలీసు అమరవీరుల సంస్మరణ సభ నిర్వహించింది.

ఇందులో సీఎం రేవంత్ రెడ్డి కూడా పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ..సమాజాన్ని పరిరక్షించడంలో పోలీసుల పాత్ర చాలా కీలకమని అన్నారు. ప్రమాదం ఉందని తెలిసినా వెళ్లే వీరులు పోలీసులు, భద్రతా సిబ్బంది అంటూ ప్రశంసలు గుప్పించారు. దేశ భద్రత, ప్రజల రక్షణలో పోలీసుల పాత్ర ఎనలేనిదని, వారికి ఏం చేసినా వారి రుణం తీర్చుకోలేమని వ్యాఖ్యానించారు. విధి నిర్వహణలో అమరులైన పోలీసుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందని భరోసా కల్పించారు.

విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన వారిని గుర్తు చేసుకోవడం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని ఆయన వివరించారు. ఈ సందర్బంగానే అమరులైన అధికారుల కుటుంబాలకు పరిహారం ప్రకటించారు సీఎం, అమరులైన ఎస్సీ, సీఐ కుటుంబాలకు రూ.కోటి 25 లక్షలు, డీఎస్‌పీ, ఏఎస్‌పీ కుటుంబాలకు రూ.1.50 కోట్లు, ఎస్పీ, ఐపీఎస్ కుటుంబాలకు రూ.2కోట్ల పరిహారం అందిస్తామని వెల్లడించారు. అంతేకాకుండా విధినిర్వహణలో ఏదైనా ప్రమాదం జరిగిన శాశ్వత అంగవైకల్యం పొందిన వారికి కూడా పరిహారం ఇస్తామని తెలిపారు.

పోలీసులంటే ఎనలేని అభిమానం

‘‘పోలీసు సిబ్బంది అంటే నాకు ఎంతో అభిమానం. వాళ్లు నాకు ఆదర్శం కూడా. ప్రమాదం ఉందని పట్టించుకోకుండా వారు తమ విధులను నిర్వహిస్తారు. అదే విధంగా నేను కూడా విమర్వలు, ఆరోపణలు ఎదుర్కొంటూ నా విధులను నిర్వహించాలని కోరుకుంటూ పోలీసుల నుంచి ప్రేరణ పొందుతుంటాను. అటువంటి పోలీసుల కుటుంబాలు ఆత్మగౌరవంతో జీవించాలి. ఎవరి ముందో వారు చేయి చాచే పరిస్థితి రాకూడదని కోరుకుంటున్నారు. విమర్వలకు అవకాశం ఇవ్వొద్దని కూడా కోరుకుంటున్నా. విధి నిర్వహణలో పోలీసులకు ఎలాంటి లోటు లేకుండా చర్యలు తీసుకుంటాం. వారి ఖర్చులు, ఇతర ఏర్పాట్లకు నిధులు కేటాయిస్తాం. నేరగాళ్లు ఎప్పటికప్పుడు అప్‌డేట్ అవుతూ అత్యాధునిక సాంకేతకతను వినియోగించుకుంటూ నేరాలకు పాల్పడుతున్నారు. అటువంటి వారిని కట్టడి చేసే పోలీసులకు కూడా అత్యాధునిక సాంకేతికతను అందిస్తాం’’ అని చెప్పుకొచ్చారు.

ఆదర్శంగా నిలుస్తున్న తెలంగాణ పోలీసులు

ఈ సందర్భంగానే తెలంగాణ పోలీసులు, వారి విధివిధానాలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ ఫోరెన్సిక్ ల్యాబ్ అనేక రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోందని వివరించారు. ‘‘మన సైబర్ క్రైమ్ విభాగం దేశంలోనే గొప్పది. కేంద్ర హోంశాఖ కూడా దీనిని అభినందించింది. ప్రస్తుతం డ్రగ్స్ మహమ్మారి యువతను పట్టిపీడిస్తోంది. ఈ డ్రగ్స్ భూతంతో పంజాబ్ సహా పలు రాష్ట్రాలో పోరాటం చేస్తున్నాయి. వీటి వినియోగం రోజురోజుకు అధికమవుతోంది. ఎంత కట్టడి చేస్తున్నా ఏదో ఒక మార్గం ద్వారా ఇవి యువతను చేరుకుంటున్నాయి. వీటగి నివారణ కోసమే టీజీన్యాబ్‌ను ఏర్పాటు చేశాం’’ అని వెల్లడించారు.

ఏఐతో ట్రాఫిక్‌కు చెక్

‘‘అదే విధంగా రోజురోజుకు పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యలకు ఏఐ పరిజ్ఞానంతో చెక్ చెప్తున్నాం. ఈ సాంకేతికతతో ట్రాపిక్ నిబంధనలను ఉల్లంఘించిన వారిని గుర్తిస్తున్నాం. నేరస్థులను కఠినంగా శిక్షించడానికి కట్టుబడి ఉన్నాం. శాంతిభద్రతలను చేతుల్లోకి తీసుకోవద్దని ప్రజలను కోరుతున్నాం. వివిధ పండగలు ప్రశాంతంగా జరుపనుకోవడంలో పోలీసుల సేవలు మర్చిపోలేం. వాళ్లు జీతం కోసం పనిచేయగ్లేదు. బాధ్యతగా భావించి సేవలందిస్తున్నారు’’ అని కొనియాడారు సీఎం రేవంత్.

Tags:    

Similar News