‘బీహార్‌కు తెలంగాణ యూరియా’

సబ్సిడీ నుంచి తప్పించుకోవడానికి ప్రభుత్వమే కృత్రిమ కొరత సృష్టిస్తోందన్న హరీష్ రావు.;

Update: 2025-08-13 10:12 GMT

యూరియా కోసం తెలంగాణ రైతులు పడుతున్న తిప్పలకు కాంగ్రెస్ ప్రభుత్వం చేతకాని తనమే కారణమంటూ మాజీ మంత్రి హరీష్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. అసలు తెలంగాణలో యూరియా కొరత లేదని, అదంతా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న కుట్రేనని ఆరోపించారు. బీఆర్ఎస్ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో తెలంగాణ యూరియా మొత్తాన్ని కాంగ్రెస్ నేతలు.. బీహార్‌కు తరలిస్తున్నారని విమర్శలు గుప్పించారు. యూరియా విషయంలో ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్న తరహాలో కాంగ్రెస్ సర్కార్ వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీహార్‌లో కాంగ్రెస్ ఉనికిని కాపాడటం కోసం, హస్తం పార్టీ పొలిటికల్ మైలేజీ పెంచడం కోసం తెలంగాణ యూరియాను అటుకు దారిమళ్లిస్తుందన్నారని వ్యాఖ్యానించారు హరీష్ రావు. అదే విధంగా తెలంగాణలో రైతులకు సబ్సిడీని ప్రకటించిన ప్రభుత్వం దాని నుంచి తప్పించుకోవడానికి కృత్రిమ యూరియా కొరతను సృష్టిస్తోందని హరీష్ రావు విమర్శలు చేశారు.

గంటలు నిల్చున్నా అందని యూరియా..

యూరియా కోసం రైతులు గంటల తరబడి క్యూలలో నిల్చున్న లాభం లేకుండా పోతోందని హరీష్ అన్నారు. యూరియా ఉన్నా సబ్సిడీ నుంచి తప్పించుకోవడం కోసం రైతులకు కావాల్సినంత యూరియా అందించడం లేదని, గూడౌన్‌లలో మూలుగుతున్న యూరియాను దొడ్డి దారిన బీహార్‌కు తరలిస్తున్నారని ఆయన ఆరోపణలు గుప్పించారు. సిద్దిపేట జిల్లాలోని రాఘవాపూర్‌లో పర్యటించిన హరీష్ రావు.. యూరియా కోసం రైతులు క్యూలో నిల్చుని ఉండటాన్ని చూసి వారితో మాట్లాడారు. ఈ సందర్భంగా రైతులు తమ యూరియా కష్టాలను హరీస్‌తో చెప్పుకున్నారు. వారి బాధలు విన్న హరీష్ రావు.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై విమర్శనాస్త్రాలు సంధించారు. యూరియా పంపిణీ విధానం నుంచి ఓటీపీ, ఒక ఆధార్‌కు ఒక బస్తా విధానాన్ని ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. యూరియా కోసం పంపిణీ కేంద్రాల ముందు రైతులు బారులు తీరి ఉన్నారని, వృద్ధ రైతులు నిల్చోలేక, వదులుకోలేక నానా అవస్థలు పడుతున్నారని హరీష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం యుద్దప్రాతిపదికన రైతుల యూరియా కష్టాలను తీర్చాలని డిమాండ్ చేశారు.

Tags:    

Similar News