ఏజెంట్ మోసానికి బలైన దుబ్బాకవాసి

కిర్గిస్థాన్ లో అక్రమ నిర్బంధం;

Update: 2025-08-09 13:01 GMT

తెలంగాణ దుబ్బాకకు చెందిన రజనీకాంత్ ఏజెంట్ మోసం చేయడంతో కిర్గిజిస్థాన్ లో ఇరుక్కున్నాడు. తన కొడుకును విడిపించడానికి రజనీకాంత్ తల్లి వరవ్వ అప్పులు చేసి లక్షరూపాయలు కట్టింది. కొడుకు ఇండియా రావడానికి రజనీకాంత్ తల్లి చివరకు పుస్తెలమ్ముకుంది.

సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం బల్వంతపూర్ గ్రామానికి చెందిన రజనీకాంత్ స్థానిక ఏజెంట్ చేతిలో దారుణంగా మోసపోయాడు. కిర్గిస్థాన్ వెళ్లిన రజనీకాంత్ ను అక్కడి కంపెనీ ఏజెంట్ నిర్బందించాడు. ఉద్యోగం ఇవ్వకపోగా రజనీకాంత్ ను ఆ కంపెనీ ఏజెంట్ అక్రమంగా నిర్బంధించాడు.ఇండియా ఏజెంట్ మోసం చేయడమే గాక కిర్గిస్థాన్ కు చెందిన ఏజెంట్ నిర్బంధించడం రజనీకాంత్ ఉద్యోగం ఆశల మీద నీళ్లు చల్లినట్లైంది.

ఉద్యోగం దేవుడెరుగు బతికుంటే బలుసాకు తిని బ్రతకొచ్చు అని అనుకున్నాడు. కుటుంబ సభ్యులకు చెప్పి మరో లక్ష రూపాయలు తెప్పించుకుని విడుదలయ్యాడు.

కిర్గిస్థాన్ ఎందుకు వెళ్లాడు

ఉద్యోగం కోసం రజనీకాంత్ కిర్గిజిస్తాన్ తీసుకెళ్లే ఏజెంట్ ను ఆశ్రయించాడు. కిర్గిస్థాన్ లో మంచి కంపెనీ ఉద్యోగం ఉందని రజనీకాంత్ కుటుంబం నుంచి లక్షలాది రూపాయలు వసూలు చేశాడు ఆ ఏజెంట్ . విదేశాల్లో ఉద్యోగం అంటే బాగా సంపాదించుకోవచ్చని రజనీకాంత్ కుటుంబం అప్పులు చేసి కిర్గిస్థాన్ పంపించింది. కిర్గిస్థాన్ కు వెళ్లిన రజనీకాంత్ తాను చేరబోయే కంపెనీకి వెళ్లాడు. రజనీకాంత్ కు అక్కడ ఎటువంటి ఆఫర్ లేదని ఆ కంపెనీ ఏజెంట్ తేల్చేయడంతో రజనీకాంత్ నివ్వెరపోయాడు. ఏజెంట్ చేసిన మోసానికి రజనీకాంత్ బలయ్యాడు.

నిర్బంధించడానికి కారణం ఇదే

ఏజెంట్ మెహబూబ్, అతని కుమారుడు అన్వర్ తమను మోసం చేయడం వల్లే రజనీకాంత్ పాస్ పోర్ట్ లాక్కొని నిర్బంధించినట్టు కంపెనీ ఏజెంట్ అంగీకరించాడు. ఏజెంట్ చేసిన మోసానికి తల్లి లక్ష రూపాయలు అప్పు చేసి కిర్గిస్థాన్ ఏజెంట్ కు డబ్బులు పంపించింది. ఇప్పటికే లక్షలాది రూపాయలు వసూలు చేసిన ఇండియా ఏజెంట్ ఆ డబ్బును తిరిగి ఇచ్చే పరిస్థితి లేదు. చేసిన అప్పులు తీర్చేది ఎట్లా అని రజనీకాంత్ కుటుంబం గగ్గోలు పెడుతోంది. లక్ష రూపాయల డబ్బును కిర్గిస్థాన్ కంపెనీ ఏజెంట్ అందుకోవడంతో రజనీకాంత్ కు పాస్ పోర్టు తిరిగిచ్చేసి విడుదల చేశారు. పాస్ పోర్టు ఇచ్చారు కానీ రజనీకాంత్ ఇండియా రావడానికి జేబులో చిల్లిగవ్వలేదు. ఇండియా వెళ్లాలంటే మరో 22వేల ప్లైట్ టికెట్, ఖర్చులకు 10 వేలు అవసరమయ్యాయి. పేద కుటుంబానికి చెందిన రజనీకాంత్ ఆ డబ్బు కోసం వెంపర్లాడాడు.

తల్లి తన పుస్తెమెట్టెలు అమ్మి ఆ మొత్తాన్ని సమకూర్చింది. శనివారం సాయంత్రం కిర్గిస్తాన్ నుంచి రజనీకాంత్ బయలు దేరాడు. ఏజెంట్లు చేసే మోసాలను అరికట్టాలని రజనీకాంత్ కుటుంబ సభ్యులు పాలకులను వేడుకుంటున్నారు.

Tags:    

Similar News