పట్నంకు హైకోర్టు షాక్
కేసును పరిశీలించిన తెలంగాణా హైకోర్టు(Telangana High Court) రిజిస్ట్రీ పిటీషన్ ను తిరస్కరించింది.
పట్నం నరేందరరెడ్డికి హైకోర్టు పెద్ద షాకిచ్చింది. తనను ప్రత్యేక బ్యారక్ లో ఉంచాలన్న పట్నం, బీఆర్ఎస్(BRS) తరపు లాయర్ దాఖలు చేసిన పిటీషన్ను కోర్టు తిరస్కరించింది. జైలులో పట్నంను ఐదుగురు నేరస్ధులుండే గదిలో కలిపి ఉంచారని పార్టీ ఆందోళన వ్యక్తంచేసింది. ఐదుగురు నేరస్ధుల నుండి పట్నం(Patnam Narendar Reddy)కు ప్రాణహాని ఉందన్నట్లుగా ఆందోళన వ్యక్తంచేసింది. కాబట్టి పట్నంకు సపరేటు బ్యారక్ కేటాయించాలని హౌజ్ మోషన్ మూవ్ చేసింది. ఈ కేసును పరిశీలించిన తెలంగాణా హైకోర్టు(Telangana High Court) రిజిస్ట్రీ పిటీషన్ ను తిరస్కరించింది. శుక్రవారం కోర్టుకు సెలవు కాబట్టే పార్టీ హౌజ్ మోషన్ మూవ్ చేసింది. శని, ఆదివారాలు ఎలాగూ సెలవులే కాబట్టి సోమవారం వరకు ఆగకుండా శుక్రవారమే హౌజ్ మోషన్ మూవ్ చేసింది. రిజిస్ట్రీ తిరస్కరించిన నేపధ్యంలో రిమాండులో ఉన్న 14 రోజులు పట్నం గదిలోని ఐదుగురు నేరస్ధులతోనే ఉంటారా ? లేకపోతే పై కోర్టులో పిటీషన్ వేస్తారా అన్నది చూడాలి.