అప్పగింతలు పూర్తిచేసిన కేటీఆర్

పార్టీ ఆఫీసులో ఎంఎల్ఏలు, ఎంఎల్సీలు, మాజీలు, ముఖ్యనేతలతో కీలకమైన సమావేశం నిర్వహించారు.

Update: 2024-11-14 09:13 GMT
KTR

అరెస్టుకు కేటీఆర్ మానసికంగా సిద్ధమైపోయినట్లున్నారు. అందుకనే పార్టీ ఆఫీసులో ఎంఎల్ఏలు, ఎంఎల్సీలు, మాజీలు, ముఖ్యనేతలతో కీలకమైన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతు ఏదో కేసులో తనను రేవంత్ రెడ్డి(Revanth Reddy) ప్రభుత్వం అరెస్టుచేయటం ఖాయమని అన్నారు. తన అరెస్టు నేపధ్యంలో పార్టీ నేతలంతా ఏకతాటిపైకి వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటాలు చేయాలని పిలుపిచ్చారు. లగచర్ల(Lagacharla) గ్రామసభలో వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్(Vikarabad Collector Pratik Jain) మీద జరిగిన దాడికి సంబందించిన రిమాండ్ రిపోర్టులో కేటీఆర్(KTR) పేరున్న విషయం అందరికీ తెలిసిందే. గ్రామసభలో కలెక్టర్, అధికారుల మీద దాడిచేసేట్లుగా పార్టీ నేత సురేష్ ను మాజీ ఎంఎల్ఏ పట్నం నరేందరరెడ్డి(Patnam Narendar Reddy) రెచ్చగొట్టినట్లు పోలీసులు చెబుతున్నారు. పట్నంను కేటీఆర్ రెచ్చగొట్టారని పోలీసులు తమ రిమాండురిపోర్టులో ప్రస్తావించారు.

ఎప్పుడైతే రిమాండు రిపోర్టు(Remand Report)లో కేటీఆర్ పేరును పోలీసులు పెట్టారో వెంటనే కేటీఆర్, హరీష్ రావు(Harish Rao) తదితరులు నానా రచ్చ మొదలుపెట్టారు. బుధవారం అర్ధరాత్రి నుండి కేటీఆర్ ఇంటిదగ్గరకు వందలసంఖ్యలో నేతలు, కార్యకర్తలు చేరుకుంటున్నారు. ఇపుడు కూడా పెద్ద సంఖ్యలో నేతలు, కార్యకర్తలు కేటీఆర్ ఇంటిదగ్గరే ఉన్నారు. కేటీఆర్ అరెస్టుకు పోలీసులు వస్తే ప్రతిఘటించేందుకు వీళ్ళంతా సిద్ధంగా ఉన్నారు. కలెక్టర్ మీద దాడిఘటనలో కేటీఆర్ కీలకవ్యక్తి కాబట్టి వెంటనే అరెస్టు చేయాలని పీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్(TPCC President Bomma Mahesh Kumar Goud) తో పాటు బీజేపీ ఎంపీ(BJP MP Dharmapuri Arvind) ధర్మపురి అర్వింద్ కూడా డిమండ్ చేస్తున్నారు. ఈ నేపద్యంలో తన అరెస్టు తప్పదని కేటీఆర్ కూడా మానసికంగా సిద్ధపడ్డారు. ఈ నేపధ్యంలోనే ప్రజాప్రతినిదులు, మాజీలతో సమావేశం పెట్టారు.

ఈ సమావేశంలోనే కేటీఆర్ అరెస్టయితే భవిష్యత్ కార్యాచరణ ఏమిటనే చర్చ జరిగింది. ఈ కేటీఆర్ సందర్భంగా మాట్లాడుతు తనను అరెస్టుచేస్తే పార్టీ మొత్తం పోరాటాలకు దిగాలన్నారు. ఏదో కేసులో తన అరెస్టు ఖాయమన్నారు. రాష్ట్రవ్యాప్తంగా పోరాటాలు చేసేందుకు నేతలు, కార్యకర్తలంతా సిద్ధంగా ఉండాలని చెప్పారు. పోరాటాలు బీఆర్ఎస్ కు కొత్తేమీకాదు కాబట్టి ఎవరూ ఆందోళనచెందాల్సిన అవసరంలేదని కూడా కేటీఆర్ అన్నారు.

Tags:    

Similar News