పట్నం నరేందర్‌రెడ్డి రిమాండ్ రిపోర్ట్‌లో కేటీఆర్ పేరు
పట్నం నరేందర్‌రెడ్డి రిమాండ్ రిపోర్ట్‌లో కేటీఆర్ పేరు ఉండటం సంచలనం రేపింది. ప్రభుత్వాన్ని అస్థిరపరిచేకుట్రలో కేటీఆర్ ఆదేశాలున్నట్టు రిపోర్ట్ పేర్కొంది.
By : The Federal
Update: 2024-11-13 15:15 GMT
పట్నం నరేందర్ రెడ్డి రిమాండ్ రిపోర్ట్‌లో కీలక అంశాలు వెలుగుచూశాయి. హకీంపేట, పోలేపల్లి, రోటిబండ తండా, పులిచెర్ల తండా, లగచర్లకు చెందిన రైతులను నరేందర్ రెడ్డి రెచ్చగొట్టినట్లు రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొన్నారు..
- కలెక్టర్‌పై దాడికి పాల్పడిన కొందరిని అదుపులోకి తీసుకుని విచారించగా, సాక్షుల విచారణలో కుట్రదారు పట్నం నరేందర్‌రెడ్డిగా తేలిందని పోలీసు రిమాండ్ రిపోర్టు పేర్కొంది.
- రైతులను ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టారని, పట్నం నరేందర్ రెడ్డి అనుచరుడు భోగమోని సురేష్ ద్వారా ప్రభావితం చేశారని రిపోర్టులో వెల్లడైంది.కొందరికి డబ్బులు ఇచ్చి దాడికి ఉసిగొల్పారని, అధికారులను చంపినా పర్వాలేదని..రైతులకు పట్నం నరేందర్‌రెడ్డి చెప్పారని పోలీసులు తెలిపారు.