‘కవిత చెప్పిన దయ్యం కేటీఆరే’

మోదీ ప్రశంసల కోసమే... ఈడీ గురించి కేటీఆర్ మాట్లాడుతున్నారు.;

Update: 2025-05-24 08:17 GMT

కేసీఆర్‌కు రాసిన లేఖ విషయంలో బీఆర్ఎస్‌లో అంతర్గత పోరు జరుగుతోంది. కవిత వర్సెస్ కేటీఆర్ తరహాలో పరిస్థితులు మారాయి. పార్టీలో కోవర్టులు ఉన్నారంటూ శుక్రవారం కవిత చేసిన వ్యాఖ్యలకు శనివారం ఉదయం కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. ఈ అంశంపైనే తాజాగా మంత్రి సీతక్క వ్యంగ్యాస్త్రాలు సంధించారు. సిస్టర్ స్ట్రోక్‌తో కేటీఆర్‌ బెంబేలెత్తిపోయారన్నారు. కేటీఆర్‌పై విమర్శల వెల్లువెత్తించారు. కేటీఆర్‌కు గ్లోబెల్ అవార్డు ఇవ్వాలని అన్నారు. కేసీఆర్ చుట్టూ దెయ్యాలు ఉన్నాయంటూ కవిత చెప్పింది కేటీఆర్ గురించే అని కూడా సీతక్క వ్యాఖ్యానించారు.

‘‘సిస్టర్ స్ట్రోక్ తో కేటీఆర్ కు చిన్న మెదడు చితికిపోయింది. కాళేశ్వరం లో కమీషన్ తీసుకున్నప్పుడు లేని భయం.. కమీషన్ ముందు కు రావడానికి ఎందుకు. గ్లోబెల్స్ ప్రచారం లో నిన్ను మించిన వారు లేరు... కేటీఆర్.. నీకు గ్లోబెల్ అవార్డు ఇవ్వాలి. అబద్దాల పునాదుల పై బిఆర్ఎస్ నడుస్తుంది. గోబెల్స్ ను కేటీఆర్ మించిపోయాడు. కవిత అన్న దెయ్యం కేటీఆరే కావొచ్చు. రాహుల్ గాంధీ గురించి మాట్లాడే స్థాయి కేటీఆర్ కు లేదు. కాళేశ్వరం కూలిపోయినప్పుడు అధికారం లో ఉంది బిఆర్ఎస్ కాదా. మోదీ ప్రశంసల కోసమే... ఈడీ గురించి కేటీఆర్ మాట్లాడుతున్నాడు’’ అని విమర్శించారు.

‘‘రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడు గా ఉన్నప్పుడు ఈ కేసు బుక్ చేసారు. యుద్ధం లో ట్రంప్ నీతి ని అమలు చేస్తున్నారు మోడీ. అబద్దాన్ని నిజం చేయడం కోసం కేటీఆర్ ప్రయత్నం చేస్తున్నారు. నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర ను కేటీఆర్ మర్చిపోయారు. రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి పై తప్పుడు విమర్శలు మానుకో. నీకు నీతి నిజాయితీ ఉంటే కాళేశ్వరం కూలేశ్వరం అయిందో చెప్పు. స్వాతంత్ర్యం కోసం పోరాడిన పత్రికకు సహాయం చేస్తే తప్పా. గులాబీ కూలీల రూపంలో దోచుకున్న డబ్బు ఎక్కడదో సమాధానం చెప్పు’’ అని ప్రశ్నించారు.

Tags:    

Similar News