‘కేటీఆర్‌కు ఆవేశ‌మెక్కువ‌..ఆలోచ‌న త‌క్కువ’

ప్రభుత్వ పథకాల విషయంలో కేటీఆర్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారన్నారు మంత్రి సీతక్క.;

Update: 2025-01-27 11:54 GMT

మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు మంత్రి సీతక్క చురకలంటించారు. కేటీఆర్‌కు ఆవేశమే తప్ప ఆలోచన లేదంటూ ఎద్దేవా చేశారు. ప్రభుత్వ పథకాల విషయంలో కేటీఆర్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉంది ప్రజా ప్రభుత్వం అని, చింతమడక సీఎంలు పాలన చేయడం లేదంటూ దుయ్యబట్టారు. గణతంత్రి దినోత్సవం సందర్భంగా నాలుగు పథకాలకు మడలానికి ఒక గ్రామంలో ప్రారంభిస్తే.. ఆ ఒక్కగ్రామానికే కొత్త పథకాలను పరిమితం చేసినట్లు కేటీఆర్ భ్రమ పడుతున్నారని సెటైర్లు వేశారు. అలా కొన్ని గ్రామాలు కొందరికే కొన్ని పథకాలే అనే సంస్కృతి కాంగ్రెస్‌కు లేదని, అదంతా బీఆర్ఎస్ సంప్రదాయమేనని విమర్శించారు. కానీ ప్రస్తుతం రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఉందని, ఇందులో అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రతి పథకం అందించడం జరుగుతుందని వివరించారు.

ప‌థ‌కాలు రాని గ్రామాలు రణ‌రంగంగా మారుతాయ‌న్న కేటీఆర్ వ్యాఖ్య‌లను మంత్రి సీత‌క్క తీవ్రంగా ఖండించారు. నూత‌న ప‌థ‌కాల‌తో గ్రామాల్లో పండ‌గ వాతావ‌ర‌ణం క‌న్పిస్తుంటే కేటీఆర్ ఓర్వ లేక‌పోతున్నార‌ని విమ‌ర్శించారు. కొత్త ప‌థ‌కాల‌ను కేవ‌లం ఒక్క గ్రామానికే ప‌రిమితం చేసిన‌ట్లుగా కేటీఆర్ భ్ర‌మ‌లు క‌ల్పిస్తున్నార‌ని మండిప‌డ్డారు. గ‌ణ‌తంత్ర దినోత్స‌వాన్ని పుర‌స్క‌రించుకుని ప్ర‌తి మండలంలో ఒక గ్రామంలో నాలుగు నూత‌న ప‌థ‌కాల‌ను విజ‌య‌వంతంగా ప్రారంభిస్తే కేటీఆర్ త‌ట్టుకోలేక పోతున్నార‌ని విమ‌ర్శించారు. ఒక గ్రామంలో ప‌థ‌కాల అమ‌లును లాంఛ‌నంగా మొద‌లు పెట్టి....ఇత‌ర గ్రామాల‌కు విస్త‌రిస్తార‌న్న ఇంగిత జ్ఞానం లేక‌పోతే ఏలా అని ప్ర‌శ్నించారు. అర్హులందరికి సంక్షేమ ఫ‌లాలు అందించ‌డ‌మే త‌మ ప్ర‌భుత్వ ల‌క్ష‌మ‌న్నారు. ఉచిత బ‌స్సు ప్ర‌యాణం, ఉచిత విద్యుత్, స‌బ్సిడి గ్యాస్ సిలిండ‌ర్ ప‌థ‌కాలు అర్హులంద‌రికి అంద‌డం లేదా అని ప్ర‌శ్నించారు. ప్ర‌జ‌ల‌ను రెచ్చ గొట్టి రాజ‌కీయ ప‌బ్బం గడుపుకోవ‌డ‌మే కేటీఆర్ ప‌ని అని మండిప‌డ్డారు. కేటీఆర్ కు ఆవేశ‌మెక్కువ‌..ఆలోచ‌న త‌క్కువ అని ఎద్దెవ చేసారు. బీఆర్ఎస్ లాగా ఎన్నిక‌ల ల‌బ్ది కోసం తాము ప‌థ‌కాలు అమ‌లు చేయ‌డం లేదన్న విష‌యాన్ని తెలుసుకోవాల‌ని హిత‌వు ప‌లికారు. ద‌ళిత గిరిజ‌న కుటుంబాల‌కు ముడెక‌రాల భూమి, అన్ని ద‌ళిత కుటుంబాల‌కు ద‌ళిత బంధు, బీసీల‌కు బీసీ బంధు, మైనారిటీల‌కు మైనారిటి బంధు హ‌మీని ఎంత మేర నెర‌వేర్చార‌ని ప్ర‌శ్నించారు. గ‌త సీఎం కేవ‌లం చింత‌మ‌డ‌క‌కే సీఎం అయిన‌ట్లు వ్య‌వ‌హ‌రించి..ప్ర‌తి ఇంటికి ప‌ది ల‌క్ష‌లు పంచి పెట్టార‌ని మండిప‌డ్డారు. కానీ త‌మ ప్ర‌భుత్వం అర్హులంద‌రికీ సంక్షేమ ప‌థ‌కాలు అందిస్తోంద‌ని తెలిపారు. గ‌త ప‌దేండ్ల‌లో పేద‌ల గృహ‌నిర్మాణాన్ని విస్మ‌రించి, కొత్త రేష‌న్ కార్డుల‌ను ఇవ్వ‌ని మీరు ఇప్పుడు మాయ‌మాట‌లు చెబితే ప్ర‌జ‌లు నమ్మె ప‌రిస్థితి లేద‌న్నారు.

Tags:    

Similar News