తెలంగాణలో భారీగా పెరగనున్న బార్లు, పబ్ లు

ఈ విషయంలో మాత్రం కెసిఆర్, రేవంత్ ప్రభుత్వాలది ఒకటే ఫిలాసఫీ;

Update: 2025-03-22 03:44 GMT

 పథకాలకు డబ్బుల్లేక అల్లాడిపోతున్న తెలంగాణ ప్రభుత్వం బార్లను బారీ సంఖ్యలో తెరిచి నాలుగు డబ్బులు సంపాయించాలనుకుంటూ ఉంది. రాష్ట్రమంతా ఎక్కడెక్కడ బార్లు తెరవచ్చో ఎక్సైజ్ శాఖ పరిశీలిస్తాంది. ఇలా 70కిపైగా కొత్త బార్లు వచ్చే అవకాశం ఉంది. సహాజంగా హైదరాబాద్ లో ఎక్కువ బార్లు వస్తాయి. రాజధానిలో ప్రతి ఇంటికి సాధ్యమయినంత దగ్గిరగా ఒక ఎలీట్ బారో, సాధారణ బారో, పబ్బో అందుబాటులోకి తెచ్చే సౌకర్యమే ఇది. ఇప్పటికీ పర్మిట్ రూమ్ లున్న వైన్ షాపు సాధారణ ప్రజల అవసరాలు  అన్ని కాలనీలలో తీరుస్తున్నాయి. ఫ్యాషనబు ల్ మనుషులోకోసం ఇపుడు బార్లు కూడా అందుబాటులోకి వస్తున్నయి.  ప్రజలంతా ఈ బార్లను ఆదరిస్తే ప్రభుత్వం ఆదాయం పెరుగుతుంది. పథకాలు బాగా అమలులఅ అవుతాయి. రాష్ట్ర ప్రజలు సంతోషంగా ఉంటారు. తెలంగాణ అభివృద్ధి చెందుతుంది. కథ నీతి సింపుల్.

రాష్ట్రంలో ప్రస్తుతం 1,171 బార్లు ఉన్నాయ. వీటిలో సగం వరకు హైదరాబాద్‌, సికింద్రాబాద్‌లోనే ఉన్నాయి. ఇవి కాకుండా 89 ఎలిట్‌ బార్లు, హైదరాబాద్‌, శంషాబాద్‌, జూబ్లీహిల్స్‌, బంజారా హిల్స్‌, మాదాపూర్‌ వంటి ప్రాంతాల్లో 55 పబ్బులు కొనసాగుతున్నాయి. గత ఏడాది (2024-25లో) ఎక్సైజ్‌ శాఖ నుంచి రూ.25,617.53 కోట్ల ఆదాయం తీసుకురావాలని లక్ష్యం పెట్టుకున్నా సాధ్యం కాలేదు.

2025-26లో ఎక్సైజ్ రెవిన్యూ టార్గెట్ రూ.27,623.36 కోట్లు. ఈ టార్గెట్ చేరుకోవాలంటే కొత్త బార్లకు అనుమతులు ఇవ్వాలి. దీనికోసం జనాభాతోపాటు వ్యాపారం జరిగే అవకాశాలున్న ప్రాంతాలను ఎన్నుకుని అనుమతులు ఇవ్వనున్నారు. ఎలైట్‌ బార్లకు అనుమతులివ్వడంతో పాటు మైక్రోబ్రూవరీల సంఖ్యను పెంచాలని ఎక్సైజ్‌ శాఖ యోచిస్తున్నది. . ఢిల్లీ, బెంగళూరు, ముంబై, చైన్నై వంటి నగరాల్లో మైక్రోబ్రూవరీలు ఎక్కువగా ఉన్నపుడు అంతర్జాతీయ నగరమయై హైదరాబాద్‌లో కేవలం పది లోపే ఉండటం వల్ల వాటి సంఖ్య పెంచేందుకు అవకాశం అందని అధికారులు భావిస్తున్నారు.

గతంలో భారత రాష్ట్ర సమితి ప్రభుత్వ హయాంలో చివరిసారిగా 2021 ఫిబ్రవరిలో కొత్త బార్ల ఏర్పాటుకు అవకాశం కల్పించారు. ఆ తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా నాటి ముఖ్యమంత్రి కెసిఆర్ బాటలోనే వెళ్లాలని నిర్ణయించింది. త్వరలోనే నోటిఫికేషన్‌ జారీ చేసి, రెండు నెలల్లో కొత్త బార్లు ఏర్పాటయ్యేలా చర్యలు తీసుకోనున్నారు. అలాగే, ఎలైట్‌ బార్లకు అనుమతులు ఇచ్చే విషయాన్నీ పరిశీలిస్తున్నారు.

ఎలిట్ రెగ్యులర్‌ లైసెన్స్‌ ఫీజు కంటే 25శాతం అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. అంటే ఒక బార్‌కు లైసెన్స్‌ ఫీజు రూ.40లక్షలు ఉంటే ఎలిట్‌ బార్‌కు రూ.50లక్షలు చెల్లించాలి. పూర్వం ఎటిట్‌ బార్ల ఏర్పాటుకు ఎప్పుడుపడితే అప్పుడు అనుమతి ఇచ్చేవారు. కెసిఆర్ ప్రభుత్వంలో కొంతకాలం కొందరికి మాత్రమే అనుమతులు ఇచ్చారు. ఆ తర్వాత ఇవ్వలేదు. తాజాగా ఎన్నిబడితే అన్నింటికి అనుమతులు ఇచ్చేందుకు కసరత్తు జరుగుతోంది.

Tags:    

Similar News