ఫన్ బకెట్ భార్గవ్‌పై 20ఏళ్ల జైలు
ఫన్ బకెట్ భార్గవ్ ఈ పేరు చాలా మంది యువతకు తెలిసే ఉంటుంది. టిక్‌టాక్ వీడియోల ద్వారా ఫేమ్ సంపాదించుకుని ఆ తర్వాత ఫన్ బకెట్‌లో కమెడియన్‌గా మంచి పేరు తెచ్చుకున్నాడు.;
ఫన్ బకెట్ భార్గవ్ ఈ పేరు చాలా మంది యువతకు తెలిసే ఉంటుంది. టిక్‌టాక్ వీడియోల ద్వారా ఫేమ్ సంపాదించుకుని ఆ తర్వాత ఫన్ బకెట్‌లో కమెడియన్‌గా మంచి పేరు తెచ్చుకున్నాడు. అతడికి శుక్రవారం విశాఖపట్నం పోక్సో కోర్టు భారీ ఝలక్ ఇచ్చింది. బాలికను గర్భవతిని చేసిన కేసులో అతడికి 20 ఏళ్ల జైలు, రూ.4లక్షల జరిమానా విధించింది. అతడిపై కేసు 2021 నుంచే నడుస్తున్నప్పటికీ తాజాగా ఈకేసులో తీర్పు వెలువరించింది న్యాయస్థానం. వెబ్ సిరీస్‌లలో అవకాశం ఇప్పిస్తానని నమ్మించి బాలికను మోసం చేశాడని పోక్సో కోర్టు భావించింది. ఆ ప్రకారం అతడికి శిక్ష విధించింది.
2021లో ఇదే కేసులో బార్గవ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. టిక్‌టాక్ వీడియోల పేరుతో బాలికను లోబర్చుకుని పలుమార్లు అత్యాచారం చేశిసట్లు విశాఖ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. దానిపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు భార్గవ్‌ను అరెస్ట్ చేశారు. అప్పటి నుంచిఈ కేసు కొనసాగుతోంది. అప్పట్లో కూడా ఈ కేసుతో వార్తల్లో నిలిచాడు భార్గవ్. తనపై కావాలని కొందరు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని కూడా అప్పట్లో అన్నాడు. కానీ ఈరోజు అతడికి న్యాయస్థానం శిక్ష విధించడంతో అతడి తప్పు నిర్ధారితమైందని నెటిజన్లు అంటున్నారు.