పహల్గామ్ ఎఫెక్ట్‌తో పాతబస్తీలో హైఅలెర్ట్..
హైదరాబాద్‌లో సున్నితమైన ప్రాంతం అంటే ప్రథమంగా ఉండేదే పాతబస్తీ కావడంతో అక్కడ భారీగా భద్రతా ఏర్పాట్లు చేపట్టారు.;
కశ్మీర్‌లోని పహల్గామ్ ప్రాంతంలో జరిగిన ఉగ్రదాడి ప్రకంపనలు పాతబస్తీ వరకు చేరాయి. ఈ ఉగ్రదాడి యావత్ దేశంలో సంచలనం రేకెత్తించింది. ఈ క్రమంలోనే హైదరాబాద్‌లోని సన్నితమైన ప్రాంతాల్లో అధిక భద్రత కల్పించాలని పోలీసులు నిశ్చయించుకున్నారు. హైదరాబాద్‌లో సున్నితమైన ప్రాంతం అంటే ప్రథమంగా ఉండేదే పాతబస్తీ కావడంతో అక్కడ భారీగా భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. పాతబస్తీ సహా పలు ప్రాంతాలపై 24/7 నిఘా పెట్టారు. ఏమాత్రం అనుమానాస్పద కదలికలు కనిపించినా వెంటనే చర్యలు తీసుకునేలా ప్లాన్ చేస్తున్నారు. గతంలో టెర్రరిస్ట్ దాడులకు గురైన ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించారు పోలీసులు.
అయితే దేశంలో ఎక్కడ ఎలాంటి ఉగ్రవాద సంబంధిత కార్యకలాపాలు జరిగినా వాటి మూలాలు హైదరాబాద్‌లోని పాతబస్తీలో ఉండటం అనేక సందర్భాల్లో జరిగింది. అలా జరగని సందర్భాలు వేళ్లపై లెక్కబెట్టొచ్చు. డ్రగ్స్ విషయంలో కూడా మూలాలు పాతబస్తీలో లభించిన సందర్భాలే ఎక్కువ. ఇప్పుడు కశ్మీర్ పహల్గామ్‌లో ఉగ్రవాదులు చేసిన మారణకాండతో సంఘవిద్రోహ శక్తులపై ఉక్కుపాదం మోపాలను కేంద్రం నిశ్చయించుకుంది. అందుకు ప్రతి రాష్ట్రంలోని ప్రభుత్వం కూడా సంపూర్ణ మద్దతు తెలిపింది. ఈ క్రమంలోనే హైదరాబాద్‌లో సున్నిత ప్రాంతాల్లో అధిక భద్రత కల్పిస్తున్నారు పోలీసులు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.