పోలీసుల అదుపులో మాజీ ఎమ్మెల్యే షకీల్..

ప్రజాభవన్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదం కేసులో ఆయనపై పోలీసులు గతంలో లుకౌట్ నోటీసులు ఇచ్చారు. దాంతో ఆయన దుబాయ్‌కు పరారయ్యారు. కొన్ని నెలలుగా ఆయన అక్కడే ఉంటున్నారు.;

Update: 2025-04-10 07:57 GMT

బీఆర్ఎస్ నేత, బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దుబాయ్ నుంచి వస్తుండగా శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో పోలీసులు అదుపులోకి తీసుకన్నారు. తల్లి అనారోగ్యం తో మృతి చెందటంతో షకీల్.. హైదరాబాద్‌కు వచ్చారు. ఇంతలో పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా తల్లి అంత్యక్రియలకు హాజరు అయ్యేందుకు పోలీసులు అనుమతి ఇచ్చారు. అయితే షకీల్‌పై వివిధ కేసుల్లో అరెస్ట్ వారెంట్ ఉంది. కొన్ని నెలలు ఆయన దుబాయ్‌లోనే ఉంటున్నారు. ఇదిలా ఉంటే ప్రజాభవన్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదం కేసులో ఆయనపై పోలీసులు గతంలో లుకౌట్ నోటీసులు ఇచ్చారు. దాంతో ఆయన దుబాయ్‌కు పరారయ్యారు. కొన్ని నెలలుగా ఆయన అక్కడే ఉంటున్నారు. ఆయన తల్లి అంత్యక్రియలు అయిన తర్వాత షకీల్‌ను పోలీసులు విచిరంచే అవకాశం ఉంది.

Tags:    

Similar News