Big breaking | ముంపు ప్రాంతాల్లో రేవంత్ పర్యటన
వర్షపునీరు, డ్రైనేజీనీరు కలిసిపోయి ఇళ్ళల్లోకి వచ్చేస్తుండటంతో అందులోని జనాలబాధ వర్ణనాతీతం;
ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి(Revanth) హైదరాబాద్(Hyderabad) నగరంలోని ముంపు ప్రాంతాల్లో ఆకస్మికంగా పర్యటిస్తున్నారు. ఎడతెరిపిలేకుండా కురుస్తున్న భారీవర్షాల(Heavy Rains) కారణంగా నగరంలోని చాలాప్రాంతాలు బాగాఎఫెక్టయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లోని వాళ్ళ పరిస్ధితులైతే ఇక చెప్పనే అవసరంలేదు. ఇళ్ళల్లోకి నీళ్ళు వచ్చేయటంతో నానా అవస్తలు పడుతున్నారు. వర్షపునీరు, డ్రైనేజీనీరు కలిసిపోయి ఇళ్ళల్లోకి వచ్చేస్తుండటంతో అందులోని జనాలబాధ వర్ణనాతీతం. ఆదివారం కాస్త వర్షం తెరిపిచ్చింది. ఉదయం నుండి ఇప్పటివరకు వర్షంపడలేదు.
వర్షాలప్రభావంపై ప్రతిరోజు సమీక్షలు చేస్తున్న రేవంత్ ఆదివారం సాయంత్రం సడెన్ గా వర్ష ప్రభావిత ప్రాంతాల్లో ఒకటైన బల్కంపేటలో పర్యటించారు. బల్కంపేట బస్తీల్లోని జనాలతో రేవంత్ మాట్లాడారు. వాళ్ళ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మంచినీటి సరఫరా, డ్రైనేజి వ్యవస్ధ, రోడ్లు, కాల్వల పరిస్ధితులపై స్ధానికుల నుండి సమాచారం అందుకున్నారు. మైత్రీవనంలోని గంగూబాయ్ బస్తీలో కూడా రేవంత్ పర్యటించారు. రేవంత్ వెంట హైడ్రా కమీషనర్ ఏవీ రంగనాధ్, జీహెచ్ఎంసీ కమీషనర్, పోలీసు ఉన్నతాధికారులు, జలమండలి ఉన్నతాధికారులు కూడా ఉన్నారు.
బుద్ధనగర్ లో డ్రైన్ సిస్టంను పరిశీలించి అధికారులకు తగు సూచనలు చేసిన సీఎం. కాలనీ రోడ్డు కంటే డ్రైనేజీ కాలువ ఎక్కువ ఎత్తులో ఉండటంతో ఇరుకుగా మారి వరద తీవ్రత పెరుగుతోందన్న సీఎం. వెంటనే డ్రైనేజీ సిస్టంను స్ట్రీమ్ లైన్ చేసి, వరద నీరు సాఫీగా వెళ్లేలా చూడాలని అధికారులకు సూచించిన రేవంత్. పక్కనే ఉన్న గంగూబాయి బస్తీ కుంటను కొంతమంది పూడ్చి వేసి పార్కింగ్ కు వినియోగిస్తున్నారని సీఎంకు పిర్యాదు చేసిన స్థానికులు. గంగూబాయి కుంట ప్రాంతాన్ని సందర్శించి అధికారులకు పలుసూచనలు చేసిన రేవంత్ రెడ్డి. డ్రైనేజి కోసమని ప్రత్యేక ట్రంక్ లైన్ ఏర్పాటు చేసి వరద సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని, వెంటనే ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.
తర్వాత వరదనీరు నిలిచిపోయిన మైత్రీవనం దగ్గర పరిస్థితిని పరిశీలించి స్థానికులనుండి వివరాలు అడిగి తెలుసుకున్న సీఎం. శాశ్వత పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు పలు సూచనలు చేశారు. రేవంత్ దగ్గరకు వచ్చి తమ ఇంటి పరిస్ధితిని వివరించిన బుద్ధనగర్లో 7వ తరగతి చదువుతున్న జస్వంత్. అలాగే కాలనీలో జస్వంత్ తో నడుస్తూ ఈ ప్రాంత పరిస్ధితులను అడిగితెలుసుకున్నారు. ఇంట్లోకి వరదనీరు చేరిన కారణంగా పుస్తకాలన్నీ తడిసిపోయినట్లు చెప్పి పిల్లాడు. భవిష్యత్తులో వరద పరిస్థితులు తలెత్తకుండా శాశ్వత పరిష్కారం చూపిస్తామని బాలుడికి హామీ ఇచ్చిన రేవంత్.