సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తే కఠిన చర్యలు : రాచకొండ సీపీ
ఒక వైపు భారత్ - పాక్ మధ్య యుద్ధం సాగుతున్న నేపథ్యంలో ఫేక్ వార్తలు, పోస్టులు వెల్తువెత్తుతుండటంతో తెలంగాణ పోలీసులు అప్రమత్తమయ్యారు.;
By : The Federal
Update: 2025-05-08 17:51 GMT
ఆపరేషన్ సింధూర్ పేరు ఇప్పుడు దేశవ్యాప్తంగా మారుమోగుతోంది. పహెల్ గామ్ లో మహిళల నుదుట సింధూరం లేకుండా చేసిన పాక్ ఉగ్రవాదులను మట్టు పెట్టేందుకు మన భారత త్రివిధ దళాలు ఆరంభించిన ఆపరేషన్ సింధూర్ పేరు చర్చనీయాంశంగా మారింది.
ఒక వైపు భారత్ - పాక్ మధ్య యుద్ధం సాగుతున్న నేపథ్యంలో ఫేక్ వార్తలు, పోస్టులు వెల్తువెత్తుతుండటంతో తెలంగాణ పోలీసులు అప్రమత్తమయ్యారు. దేశ భద్రత, సున్నిత మైన అంశాలపై పోస్టులు చేసే ముందు జాగ్రత్త అంటూ రాచకొండ పోలీసు కమిషనర్ జి సుధీర్ బాబు హెచ్చరించారు.
ఫేక్ పోస్టులు, వీడియోలు పోస్టు చేస్తే చర్యలు తీసుకుంటామని సీపీ హెచ్చరించారు.ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో ప్రజలను భయాందోలనలకు గురిచేసే పోస్టులు చేయవద్దని ప్రజలు బాధ్యతగల పౌరులుగా వ్యవహరించాలని సీపీ సూచించారు. సోషల్ మీడియాను దుర్వినియోగం చేస్తే చర్యలు తప్పవని ఆయన చెప్పారు.
‘‘సోషల్ మీడియాలో బాధ్యతగల పౌరులుగా స్పందించండి. సున్నితమైన అంశాలపై జాగ్రత్తగా వ్యవహరించండి. సోషల్ మీడియాలో ఏదైనా పోస్టు చేసేముందు ఒకటికి రెండుసార్లు నిర్ధారించుకోండి. ఫేక్ పోస్టులు చేస్తే చర్యలు తప్పవని గుర్తుంచుకోండి’’అని రాచకొండ సీపీ జి సుధీర్ బాబు చెప్పారు.