కేటీఆర్‌ను కలిసిన తీన్మార్ మల్లన్న
బీసీ రిజర్వేషన్ల కోసం ఢిల్లీ వేదికగా తాము చేయనున్న ధర్నాకు కేటీఆర్, హరీష్‌ను ఆహ్వానించడం కోసమే ఆయన కేసీఆర్, హరీష్‌ను కలిశారు.;
కొన్ని రోజులుగా వార్తల్లో నిలుస్తున్న వ్యక్తి తీన్మార్ మల్లన్న. కాంగ్రెస్ ఎమ్మెల్సీగా ఉంటూనే కాంగ్రెస్‌ను నిర్వహించిన కులగణనపై ఆయన సంచలన వ్యాఖ్యలు చేసి వార్తలకు కేంద్రబిందువుగా మారారు. ఆయనపై కాంగ్రెస్ పార్టీ యాక్షన్ తీసుకోవడంతో ఆయన మరింత లైమ్‌లైట్‌లోకి వచ్చారు. బడాబడా నేతల మాదిరిగానే తీన్మార్ మల్లన్న గురించి రాష్ట్రవ్యాప్తంగా చర్చ మొదలైంది. ఈ క్రమంలోనే సోమవారం అసెంబ్లీలో ఆయన బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీష్ రావుతో భేటీ అయ్యారు. అధికార పార్టీ కాంగ్రెస్‌లో మొన్నటి వరకు ఉన్న తీన్మార్ మల్లన్న ఇప్పుడు బీఆర్ఎస్ నేతలతో భేటీ కావడం సర్వత్రా చర్చనీయాంశమయింది. బీఆర్ఎస్ కండువా కప్పుకోవడానికి మల్లన్న రెడీ అయ్యారా? దానిపై చర్చించడానికే కేటీఆర్, హరీష్‌ను కలిశారా? అన్న చర్చగట్టిగా జరుగుతోంది.
అయితే బీసీ రిజర్వేషన్ల కోసం ఢిల్లీ వేదికగా తాము చేయనున్న ధర్నాకు కేటీఆర్, హరీష్‌ను ఆహ్వానించారు మల్లన్న. ఈ మేరకు ఆహ్వానం అందించడం కోసమే ఆయన కేసీఆర్, హరీష్‌ను కలిశారు. ఈ సందర్భంగా మల్లన్న మాట్లాడుతూ.. ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ల కోసం అసెంబ్లీలో బిల్లు తీసుకురావడం కాదని, అవసరం అయితే కేంద్ర ఆమోదం కోసం ఢిల్లీ జంతర్‌మంతర్ సర్కిల్‌లో ధర్నా చేయాలని డిమాండ్ చేరస్తున్నట్లు మల్లన్న చెప్పారు. ఇందుకోసం బీఆర్ఎస్ సహకారం కావాలని కోరినట్లు చెప్పారు.