విద్యుత్ శాఖ కార్మికులకు ప్రమాద బీమా

రేవంత్ రెడ్డి, ఇందిరమ్మ ప్రభుత్వం నాయకత్వంలో మాత్రమే ఇది సాధ్యమైంది;

Update: 2025-05-26 10:59 GMT

విద్యుత్ శాఖ కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. వారికి కోటి రూపాయల ప్రమాద బీమా అందించనున్నట్లు ప్రకటించారు. భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇటువంటి స్కీమ్ ఇప్పటి వరకు అందుబాటులోకి తీసుకొచ్చింది లేదని, తొలిసారి తెలంగాణ ప్రభుత్వమే ఈ నిర్ణయం తీసుకుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు. సింగరేణి నుండి విద్యుత్ శాఖలకు ఈ పథకం విస్తరణను ఆయన గొప్ప పరిణామంగా ఆయన పేర్కొన్నారు. విద్యుత్ శాఖ కార్మికుల విషయంలో ప్రభుత్వం తీసుకున్న ఈ చొరవ ఒక చారిత్రాత్మక మైలురాయి అని, కార్మికుల సంక్షేమం పట్ల తమ ప్రభుత్వ నిబద్దతకు అద్ధం పడుతుందని వ్యాఖ్యానించారు. అన్ని వర్గాల ప్రజల అభివృద్ధే తమ ప్రభుత్వ ధ్యేయమన్నారు. NPDCL (నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్) కింద విధుల్లో ఉన్నప్పుడు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన విద్యుత్ కార్మికుడు జోగున్ నరేష్ కుటుంబానికి ₹1 కోటి ప్రమాద బీమా చెక్కును, విద్యుత్ శాఖలో నరేష్ భార్య రమేష్ భార్య కారుణ్య నియామక లేఖను అందజేశారు.

"ఈ చొరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇందిరమ్మ ప్రభుత్వం నాయకత్వంలో మాత్రమే సాధ్యమైంది. గతంలో ఏ ప్రభుత్వం కూడా విద్యుత్ కార్మికుల సంక్షేమం పట్ల ఇంత చురుకైన, మానవీయ విధానాన్ని తీసుకోలేదు. సింగరేణి కాలరీస్‌లో మొదట ప్రారంభించిన ప్రమాద బీమా పథకాన్ని ఇప్పుడు విద్యుత్ శాఖ ఉద్యోగులను కూడా చేర్చడానికి విస్తరించాం. ఇది శ్రామిక శక్తికి కొత్త భద్రత. గౌరవాన్ని తీసుకువస్తుంది’’ అని చెప్పుకొచ్చారు.

Tags:    

Similar News