ప్రజలకు రేవంత్ సర్కార్ నుంచి అదిరిపోయే దీపావళి గిఫ్ట్
దీపావళి వేళ హుస్నాబాద్ ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చింది. ఏంటంటే..
దీపావళి వేళ హుస్నాబాద్ ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చింది. దీపావళి పండగ సందర్భంగా హుస్నాబాద్‌లోని 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రిని ప్రభుత్వం అప్‌గ్రేడ్ చేసింది. హుస్నాబాద్, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చొరవతోనే ఈ అప్‌గ్రేడ్ సాధ్యమైందని అధికారులు చెప్తున్నారు. ఈ వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రిని 250 పడగ ఆసుపత్రికి అప్‌గ్రేడ్ చేయాలని నిశ్చయించినట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఈ మేరకు ఉత్తర్వులు కూడా జారీ చేసింది.
దీనిని దీపావళి కానుకగానే అప్‌గ్రేడ్ చేస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఈ అప్‌గ్రడేషన్ కోసం రూ.82కోట్లు వెచ్చించనున్నట్లు కూడా ప్రభుత్వం తన ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ అప్‌గ్రడేషన్ ప్రాజెక్ట్ కోసం రాష్ట్ర మెడికల్, హెల్త్, ఫ్యామిలీ వెల్ఫేర్ శాఖ నిధులను విడుదల చేసింది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 250 పడకల ప్రభుత్వ ఆసుపత్రి అందుబాటులోకి వస్తే హుస్నాబాద్‌లో లభిస్తున్న వైద్య సదుపాయాలు మెరుగు పడతాయని, ప్రజలకు కూడా ఆరోగ్యవంతమైన జీవనం చేరువవుతుందని ప్రజలు అంటున్నారు. ఈ సందర్బంగా మంత్రి పొన్నం ప్రభాకర్ ఓ సమావేశం కూడా నిర్వహించారు.
పేదల సంక్షేమమే ప్రథమం
‘‘ముందుగా ఈ ఆసుపత్రి అభివృద్ధి కోసం సహకరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, దామోదర రాజనర్సింహులుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. పేదల సంక్షేమానికే మా ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. వారికి సుభిక్ష పాలన అందించడం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోంది. దీపావళి పండగ కానుకగా హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజలకు ప్రభుత్వం తీపికబురు తెలిపింది. ప్రభుత్వం 100 పడకలతో ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్న ఆసుపత్రికి 250 పడకల దవాఖానాగా మారుస్తూ జీవోను విడుదల చేసింది ప్రభుత్వం. ప్రజలకు మెరుగైన వైద్యసేవలను అందుబాటులోకి తీసుకొస్తాం’’ అని భరోసా ఇచ్చారు.
ఇందిరా గాంధీకి నివాళులు
ఇదిలా ఉంటే దీపావళి పండగ సందర్భంగా ఈరోజు ఉదయం మంత్రి పొన్నం ప్రభాకర్.. స్వర్గీయ ప్రధాని ఇదిరా గాంధీకి నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. ‘‘భారతదేశ ప్రజాస్వామ్యంలో అనేక సంస్కరణలు చేసి ప్రజాహిత నిర్ణయాలు తీసుకొని ఈ దేశ ప్రజలకు అమ్మగా ఇందిరా గాంధీ నిలిచారు. ఈరోజుకు కూడా అన్ని ప్రభుత్వాలు ఇందిరమ్మ పాలన తేవాలని తపనపడుతున్నాయి. నేటి ప్రభుత్వాలకు కూడా ఆదర్శంగా తీసుకునేలా నిలుస్తున్న ఇందిరమ్మకు కాంగ్రెస్ పార్టీ తరుపున నివాళులు అర్పిస్తున్నాం. ఈరోజు యువత ముఖ్యంగా మహిళలు ఆత్మస్థైర్యం కోల్పోకుండా ఏ విధంగా తమ తమ రంగాల్లో వృత్తి వ్యవహారపరంగా ఎలా ఉండాలి అనడానికి ఇందిరా గాంధీ నిలువెత్తు నిదర్శనం. అందుకే మరోసారి ఇందిరమ్మ లాంటి నాయకురాలు ఇచ్చిన స్ఫూర్తిని ఈదేశ యువత ఆదర్శంగా తీసుకొని దేశ ఐక్యత కోసం జాతీయ భావం , అభివృద్ధి, పెదల పట్ల పూర్తి శ్రద్ధ, అన్ని రకాల అంశాలకు ప్రాధాన్యత ఇవ్వాలి’’ అని అన్నారు.