డిగ్రీ ప్రవేశాలకు ‘దోస్త్’ నోటిఫికేషన్ వచ్చేసింది..

అసలు ఈ దోస్త్ నోటిఫికేషన్ ఏంటి? ఇదెప్పుడు విడుదల చేస్తారు?;

Update: 2025-05-02 10:04 GMT

తెలంగాణలో ఇంటర్ మీడియట్ పరీక్షల ఫలితాలు ఇటీవల విడుదలయ్యాయి. డిగ్రీ ప్రవేశాలకు కూడా కళాశాలలు అడ్మిషన్లను షురూ చేశాయి. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం డిగ్రీ ఆన్‌లైన్ సర్వీసెస్ తెలంగాణ(DOST) నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ కింద మూడు విడతల్లో ఢిగ్రీ ప్రవేశాలకు అహ్వానం కల్పించారు.

మొదటి ఫేజ్‌: మే 3 నుంచి 21 వరకు మొదటి ఫేజ్‌ దరఖాస్తుల స్వీకరణ ఉంటుంది. మే 10 నుంచి 22 వరకు వెబ్‌ ఆప్షన్లకు అవకాశం కల్పించారు. మే 29న మొదటి ఫేజ్‌ సీట్ల కేటాయింపు.

రెండో ఫేజ్‌: మే 30 నుంచి జూన్‌ 8 వరకు దరఖాస్తుల స్వీకరణ. మే 30 నుంచి జూన్‌ 9 వరకు వెబ్‌ ఆప్షన్లు. జూన్‌ 13న సీట్ల కేటాయింపు.

మూడో ఫేజ్‌: జూన్‌ 13 నుంచి 19 వరకు దరఖాస్తుల స్వీకరణ. జూన్‌ 13 నుంచి 19 వరకు వెబ్‌ ఆప్షన్లు. జూన్‌ 23న సీట్ల కేటాయింపు. జూన్‌ 30 నుంచి డిగ్రీ కళాశాలల్లో తరగతులు ప్రారంభమవుతాయి.

ఇంతకీ ఈ దోస్త్ నోటిఫికేషన్ ఏంటి..

దోస్త్ నోటిఫికేషన్ అనేది డిగ్రీ కోర్సుల్లో ప్రవేశం కోసం దరఖాస్తులు ఎలా చేయాలనే దానిపై సమాచారం అందించే ఒక ప్రకటన. ఈ నోటిఫికేషన్ ద్వారా, దరఖాస్తులు చేసే విధానం, చివరి తేదీ, అవసరమైన ధ్రువీకరణ పత్రాలు, మరియు ఇతర ముఖ్యమైన సమాచారం అభ్యర్థులకు అందుబాటులో ఉంటుంది. ఇది సాధారణంగా, ఇంటర్మీడియట్ ఫలితాలు వెలువడిన కొద్ది రోజుల తర్వాత దోస్త్ నోటిఫికేషన్ విడుదల అవుతుంది. ఈ ఏడాది, 2025 విద్యా సంవత్సరానికి సంబంధించిన దోస్త్ నోటిఫికేషన్ మే 2వ తేదీన విడుదల అయ్యింది. దోస్త్ నోటిఫికేషన్ ద్వారా, అభ్యర్థులు డిగ్రీ కోర్సుల్లో ప్రవేశం కోసం ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ప్రక్రియలో, అభ్యర్థులు తమ వ్యక్తిగత వివరాలు, మార్కులు, ఇతర అవసరమైన ధ్రువీకరణ పత్రాలను సమర్పించాలి.

Tags:    

Similar News