‘విలన్లు క్లైమ్యాక్స్ లోనే అరెస్టవుతారు’

అవినీతి, అవకతవకలకు పాల్పడిన కేసీఆర్(KCR) ఫ్యామిలీలో ఎవరినీ వదిలిపెట్టేదిలేదన్నారు;

Update: 2025-07-17 09:19 GMT
Revanth

బీఆర్ఎస్ హయాంలో జరిగిన అవినీతి, అవకతవకలపై కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కుటుంబాన్ని వదిలిపెట్టే ప్రశక్తేలేదని ఎనుముల రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతు కాళేశ్వరం, టెలిఫోన్ ట్యాపింగ్ పై దర్యాప్తులు జరుగుతున్నట్లు చెప్పారు. అవినీతి, అవకతవకలకు పాల్పడిన కేసీఆర్(KCR) ఫ్యామిలీలో ఎవరినీ వదిలిపెట్టేదిలేదన్నారు. కేసుల దర్యాప్తుకు కేంద్రమే అడ్డుపడుతోందని ఆరోపించారు. కాళేశ్వరం, ట్యాపింగ్ దర్యాప్తును తన చేతిలోకి తీసుకోవాలని కేంద్రం ప్రయత్నిస్తున్నట్లు మండిపడ్డారు. అనేక కేసుల్లో కేంద్ర-రాష్ట్రంలోని దర్యాప్తు సంస్ధలు కలిసి పనిచేస్తున్నట్లు రేవంత్ చెప్పారు.

తమప్రభుత్వం వచ్చినతర్వాత కేసీఆర్ హయాంలో జరిగిన అవినీతి, అవకతవకలపై విచారణలు, దర్యాప్తులు జరుగుతున్న విషయాన్ని రేవంత్ గుర్తుచేశారు. కాళేశ్వరం, ట్యాపింగ్ దర్యాప్తులను కేంద్రానికి అప్పగించాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి(Kishan Reddy) పదేపదే డిమాండ్ చేయటంలో ఉద్దేశ్యం ఏమిటని సీఎం ప్రశ్నించారు. కేసీఆర్ కుటుంబాన్ని కాపాడాలని కిషన్ ప్రయత్నిస్తున్నట్లు మండిపడ్డారు. కేసుల దర్యాప్తులో హడావుడిచేయటం తనకు ఎంతమాత్రం ఇష్టంలేదన్నారు. దర్యాప్తుసంస్ధలు తమపని తాము చేసుకుని పోతున్నట్లు చెప్పారు. విలన్లు ఎప్పుడూ క్లైమ్యాక్సులోనే అరెస్టవుతారని ఒకప్రశ్నకు రేవంత్ సమాధానమిచ్చారు. కేటీఆర్(KTR) డ్రగ్స్ కేసులో కూడా విచారణ జరుగుతోందన్నారు. బీసీ రిజర్వేషన్లపై ఆర్డినెన్స్ విషయంలో తమ వ్యూహాలు తమకు ఉన్నట్లు రేవంత్ స్పష్టంచేశారు.

చంద్రబాబుతో తన భేటీగురించి మాట్లాడుతున్న హరీష్ రావు(Harish Rao) ఏ విషయంలో నారా లోకేష్(Nara Lokesh) తో భేటీ అయ్యారో చెప్పాలని రేవంత్ నిలదీశాడు. లోకేష్ తో హరీష్ డిన్నర్ మీటింగ్ ఎందుకు జరిగిందో బయటపెట్టాలని డిమాండ్ చేశాడు. అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ హాజరవ్వాలని రేవంత్ మరోసారి డిమాండ్ చేశాడు. మరి రేవంత్ డిమాండ్ కు హరీష్ సమాధానం ఇస్తారా ? కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతారా అన్నది చూడాలి.

Tags:    

Similar News