కరెగుట్ట ఆపరేషన్‌లో 38 మంది మావోలు హతం..

వరుసగా ఐదు రోజుల నుంచి ఈ ఆపరేషన్ కొనసాగుతోంది. ఈ క్రమంలో శుక్రవారం మరోసారి కాల్పులు జరిగాయి.;

Update: 2025-04-26 06:38 GMT

నక్సలిజాన్ని అంతమొందించాలన్న లక్ష్యంతో కేంద్రం చేపట్టిన ఆపరేషన్ ‘కగార్’. ఈ ఆపరేషన్ ప్రస్తుతం తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లోని ఉసురు పోలీస్‌స్టేషన్ పరిధిలోని కర్రెగుట్ట అడవుల్లో జరిగుతోంది. ఇందులో భాగంగా భారీ సంఖ్యలో భద్రతా బలగాలు అటవీ ప్రాంతంలో కూంబింగ్ చేస్తున్నాయి. వరుసగా ఐదు రోజుల నుంచి ఈ ఆపరేషన్ కొనసాగుతోంది. ఈ క్రమంలో మావోలకు భద్రతా బలగాలు భారీ ఝలక్ ఇచ్చాయి. శుక్రవారం కర్రెగుట్ట అటవీ ప్రాంతంలో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. ఇందులో దాదాపు 38 మంది మావోలు మరణించారు. శుక్రవారం ఉదయం ఏడు గంటల నుంచే నాలుగు వైమానిక దళ హెలికాప్టర్లు కర్రెగుట్ట అటవీ ప్రాంతంపై చక్కర్లు కొడుతున్నాయి. మావోల జాడ తెలుసుకుని గ్రౌండ్‌లో ఉన్న దళాలకు సమాచారం అందిస్తోంది. ఈ క్రమంలో రాత్ర 10 గంటల ప్రాంతంలో భారీగా కాల్పులు, బాంబు పేలుళ్లు జరిగాయి. ఈ కాల్పుల్లో 38 మంది మావోలను భద్రతా బలగాలు హతం చేశాయి.

మరోవైపు భద్రతా బలగాలపై ఎండ ప్రభావం కూడా తీవ్రంగా ఉంది. ఐదు రోజుల నుంచి వాళ్లు అడవిలోనే ఉండటంతో ఇప్పటికే పలువురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వీరిలో ముగ్గురిని మెరుగైన చికిత్స కోసం భద్రాచలం తరలించారు. కూంబింగ్ జరుగుతున్న క్రమంలో ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో జవాన్లు పలు ఆంక్షలు విధిస్తున్నారు.

Tags:    

Similar News