భర్తను చంపేందుకు భార్య సుపారి..చివరి నిముషంలో ఫెయిల్
భర్త సుమన్ ను చంపేందుకు భార్య ఒక సూపర్ స్కెచ్ వేసింది.;
భర్తను చంపేందుకు ఒక భార్య వేసిన సూపర్ స్కెచ్ చివరి నిముషంలో ఫెయిలైంది. సూపర్ స్కెచ్ ఎలాగ ఫెయిలైంది ? పోలీసులు ఎలా ఫెయిల్ చేశారు ? విషయం ఏమిటంటే వరంగల్ జిల్లా నర్సంపేట మండలం ఆకులతండాకు చెందిన ధారావత్ సుమన్ కు మహేశ్వరం గ్రామానికి చెందిన మంజులతో 2018లో వివాహమైంది. హైదరాబాదు(Hyderabad)లోని ఒక బ్యాంకులో సుమాన్ ఉద్యోగం చేస్తున్నాడు. వీళ్ళకు ఒక కూతురు కూడా ఉంది. అయితే ఏవో కారణాలతో భార్యా, భర్తలకు పడటంలేదు. అందుకనే ఎవరికి వారుగా విడిగానే ఉంటున్నారు కొంతకాలంగా. అయితే వీళ్ళమధ్య ఏమైందో తెలీదుకాని భర్త సుమన్ ను చంపేందుకు భార్య ఒక సూపర్ స్కెచ్ వేసింది.
తన స్కెచ్ లో భాగంగా తన బావ ద్వారా ఒక గ్యాంగును కలిసింది. తన భర్తను హత్యచేసే బాధ్యత గ్యాంగు(supari Gang)కు అప్పగించింది. చర్చలతర్వాత సుమన్ ను చంపేందుకు గ్యాంగ్ తో మంజులకు రు. 10 లక్షలకు ఒప్పందం జరిగింది. ఒప్పందంలో భాగంగా అడ్వాన్సుగా భార్య కొంత డబ్బును కూడా చెల్లించింది. అయితే పదిరోజుల క్రితం నరేష్ అనే యువకుడినుండి సుమన్ కు ఫోన్ వచ్చింది. తనను తాను పరిచయంచేసుకున్న నరేష్ తనకు కొంత డబ్బిస్తే ముఖ్యమైన సమాచారం ఇస్తానని చెప్పాడు. మొదట్లో ఏదో ప్రాంక్ ఫోన్(Prank Phone) అనుకుని భర్త పట్టించుకోలేదు. అయితే రిపీటెడుగా ఫోన్ వస్తుండటం, బెదిరిస్తున్నట్లు మాట్లాడుతుండటంతో భర్తలో భయం మొదలైంది. కుటుంబసభ్యులతో చెప్పగానే అంతా కలిసి పోలీసులకు విషయాన్ని చెప్పారు.
పోలీసుల(Telangana Police) సలహా ప్రకారం భర్త తనకు ఫోన్ చేసిన వ్యక్తితో మాట్లాడాడు. అడిగినంత డబ్బిస్తాను విషయం ఏమిటో చెప్పమని సుమన్ అడిగాడు. దాంతో సుమన్ ను హత్యచేయటానికి భార్య వేసిన సూపర్ స్కెచ్ ను, గ్యాంగుతో జరిగిన ఒప్పందాన్ని, చెల్లించిన అడ్వాన్స్ విషయం మొత్త వివరాలను నరేష్ చెప్పేశాడు.నరేష్ చెప్పిన వివరాల ప్రకారం హోలీపండుగకు ముందే సుమన్ ను చంపేయాలి. విషయం తెలుసుకున్న పోలీసులు మొబైల్ నెంబర్ ఆధారంగా అడ్రస్ పట్టుకుని ఒక్కసారిగా దాడిచేసి ఫోన్ చేసిన నరేష్ ను పట్టుకున్నారు. పోలీసుస్టేషన్లో జరిపిన విచారణతో భర్తను చంపటానికి భార్య ఇచ్చిన సుపారి వివరాలు మొత్తాన్ని నరేష్ చెప్పేశాడు. దాంతో ముందు భార్య మంజులను తర్వాత సుపారి తీసుకున్న గ్యాంగులోని సభ్యులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సుమన్ ను చంపేందుకు మంజులకు సహకరించిన ములుగులో ఉంటున్న బావ మోతీలాల్, వరంగల్ జిల్లా రాయపర్తికి చెందిన నరేష్, నర్సంపేట మండలం ఆకులతండాలోనే ఉంటున్న గోపి, మహబూబాబాద్ జిల్లా తొర్రూరుకు చెందిన మల్లేష్ ను అరెస్టుచేసిన పోలీసులు అందరినీ రిమాండుకు తరలించారు.
విషయం ఎలా బయటపడింది ?
మనిషికి ఆశ ఉన్నట్లే అత్యాసకూడా ఉంటుంది. భర్తను చంపటానికి భార్య ఇచ్చిన సుపారి వ్యవహారం కూడా ఇలాగే బయటపడింది. ఎలాగంటే సుపారీ తీసుకున్న గ్యాంగులో నరేష్ కూడా సభ్యుడే. అందరితో కలిసి హత్య చేస్తే తనకు వచ్చే డబ్బు చాలా కొంచెమే కదా అని ఆలోచించాడు. అదే చంపటానికి సుపారి తీసుకున్నట్లు భర్తకు ఫోన్ చేసి బెదిరిస్తే ఇంకా ఎక్కువ డబ్బు వస్తుందని ఆలోచించాడు. అందుకనే సుమన్ కు ఫోన్ చేసి పదేపదే బెదిరించింది. కాకపోతే విషయం పోలీసులకు చేరటంతో కథ మొత్తం అడ్డంతిరిగి సుపారి ఇచ్చిన భార్యతో పాటు గ్యాంగు మొత్తం పట్టుబడింది.