‘‘ఇది ఫిషింగ్ యాత్ర కాదు’’ మద్రాస్ హైకోర్టులో ఈడీ అఫిడవిట్

టాస్మాక్ చేసిన ఆరోపణలను ఖండించిన ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్;

Update: 2025-04-02 07:59 GMT

మహాలింగం పొన్ను స్వామి

ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ పై తమిళనాడు స్టేట్ మార్కెటింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ (టాస్మాక్) దాఖలు చేసిన రెండు రిట్ పిటిషన్ల విచారణను మద్రాస్ హైకోర్టు ఏప్రిల్ 8, 2025 కి వాయిదా వేసింది.

గత నెల మార్చి 6 నుంచి 8 వరకు టాస్మాక్ చెన్నై ప్రధాన కార్యాలయంలో మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద ఈడీ నిర్వహించిన సోదాలు,స్వాధీన కార్యకలాపాల చట్టబద్దతను సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఈ పిటిషన్లను దాఖలు చేసింది.

ప్రైవేట్ డిస్టిలరీలు, బాటిలర్ల నుంచి వెయ్యి కోట్ల మద్యం కుంభకోణానికి సంబంధించి ఆధారాలను వెలికితీసినట్లు ఈడీ పేర్కొంది.

తన చర్యలకు సమర్థించుకున్న ఈడీ..
తమిళనాడులోని టాస్మాక్ ప్రధాన కార్యాలయంపై ఈడీ చేసిన సోదాలను సమర్థించుకుంది. చట్టపరమైన ప్రోటోకాల్ లను పాటిస్తున్నట్లు న్యాయస్థానం ముందు వివరించింది.
వేధింపులు, చట్టపరమైన, విధానపరమైన ఉల్లంఘనలకు పాల్పడినట్లు టాస్మాక్ చేసిన వాదనలు కేంద్ర దర్యాప్తు సంస్థ తోసిపుచ్చింది. ఈ కేసు ప్రజా జవాబుదారీతనం, తమిళనాడులో ఆర్థిక నేరాలపై పోరాటంపై దాని ప్రభావం కారణంగా దృష్టిని ఆకర్షించిందని తెలిపింది.
ప్రభుత్వ యాజమాన్యంలోని మద్యం రిటైల్ సంస్థ అయిన టాస్మాక్, ఈడీ చర్యలను వ్యతిరేకించింది. కేంద్ర దర్యాప్తు సంస్థలు అధికార పరిధిలేనివి, చట్టవిరుద్దమైనవి, ఏకపక్షమైనవని ప్రకటించాలని కోరింది. టాస్మాక్ అధికారులపై వేధింపులను నివారించడానికి ఒక ఆదేశం ఇవ్వాలని కోరింది.
ఈడీ అసిస్టెంట్ డైరెక్టర్ వికాస్ కుమార్ హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. అయన టాస్మాక్ కార్యకలాపాలను అంశాలవారీగా ఖండించాడు. టాస్మాక్ లో జరిగిన అవినీతి పక్కదారి పట్టించడానికి కోర్టును ఉపయోగించుకున్నారని తన పిటిషన్ లో ఆరోపించారు.
పిటిషన్ ను సవాల్ చేసిన ఈడీ..
హైకోర్టులకు రాజ్యాంగం ప్రసాదించిన అధికరణ 226 కింద ఉన్న అధికారాలను ఉపయోగించే ముందు పీఎంఎల్ఏ కింద ఉన్న చట్టబద్దమైన పరిష్కారాలను ఉపయోగించుకోకుండా ముందస్తుగానే కోర్టును ఆశ్రయించిందని ఈడీ తన పిటిషన్ లో పేర్కొంది.
‘‘పిటిషనర్ కు పీఎంఎల్ఏ ఫ్రేమ్ కింద ప్రత్యామ్నాయ పరిష్కారాలు ఉన్నాయి. వాటిని ముందుగా పూర్తి చేయాలి. తరువాత న్యాయస్థానాలను ఆశ్రయించాలి’’ అని తన కౌంటర్ లో పేర్కొంది. ఈ పిటిషన్లను తోసిపుచ్చాలని హైకోర్టును కోరింది.
విశ్వసనీయ సమాచారం ప్రకారం.. డైరెక్టరేట్ ఆఫ్ విజిలెన్స్ అండ్ యాంటీ కరప్షన్ (డీవీఏసీ)నమోదు చేసిన బహుళ ఎఫ్ఐఆర్ లను ఉదహరించింది. పీఎంఎల్ఏ సెక్షన్ 17 కింద నిర్వహించిన సోదాలను ఎన్ ఫోర్స్ మెంట్ ఏజెన్సీ సమర్థించుకుంది.
దర్యాప్తు సంస్థలు నమోదు చేసిన ప్రాథమిక సమాచారం ప్రకారం.. టాస్మాక్ లో విస్తృతమైన అవినీతిని నిరూపించాయని తన అఫిడవిట్ లో ఆరోపించింది. తాము ఆకస్మిక తనిఖీల సమయంలో దొరికిన లెక్కల్లో లేని నగదు, అనుకూలమైన పోస్టింగ్ ల కోసం సీనియర్ అధికారులు సేకరించిన లంచాలు, బ్రూవరీల నుంచి అక్రమ చెల్లింపులు ఉన్నాయని తెలిపింది.
‘‘దర్యాప్తు అవినీతి నిరోధక చట్టం 1988 కింద షెడ్యూల్ చేయబడిన నేరాలను లక్ష్యంగా చేసుకుంది. ఇవి పూర్తిగా పీఎంఎల్ఏ పరిధిలోకి వస్తాయి’’ అని ఈడీ వాదించింది. టాస్మాక్ చేసిన తమిళనాడు నిషేధచట్టం 1937 వాదనను తోసిపుచ్చింది.
చట్టం ప్రకారంగానే ముందుకు వెళ్తున్నామంది..
మార్చి 5న ఈడీ చెన్నై జోన్ -1 జాయింట్ డైరెక్టర్ అధికారం ఇచ్చిన సోదాలకు, టాస్మాక్ ప్రాంగణంలో మనీలాండరింగ్ ఆధారాలు ఉన్నాయని చెప్పడానికి బలమైన కారణాలు ఉన్నాయని కౌంటర్ లో వివరించింది.
సెర్చ్ వారెంట్ ఇవ్వలేదని ఆరోపణలను కూడా టాస్మాక్ చేసిన వాదనలను ఈడీ తోసిపుచ్చింది. ఇవి చట్టపరమైన నిబంధనలు మాత్రమే అని, పంపిణీ కాదని పేర్కొంది.
అదంతా అవాస్తవం..
ఏకధాటిగా 60 గంటల పాటు సోదాలు చేశారనే టాస్మాక్ ఆరోపణలను సైతం ఈడీ విభేదించింది. మార్చి 6న మధ్యాహ్నం 1. 55 గంటలకు సోదాలు ప్రారంభించామని, మార్చి 8న రాత్రి 11. 40 కి ముగించామని పేర్కొంది. మధ్యలో భోజన విరామం, విశ్రాంతి సమయం ఇచ్చామని వివరించింది.
‘‘మహిళా సిబ్బందిని రాత్రిపూట సోదాలు జరిగిన చోట బసచేయమని బలవంతం చేయలేదని పేర్కొంది. శ్రీ. ఎం. జోతి శంకర్ గుండె జబ్బు కారణంగా బయటకు సైతం పంపించామని వివరించింది.’’ కొంతమంది స్వతంత్య్ర సాక్షుల సంతకం చేసిన పంచనామా ద్వారా ఈడీ వాదన చేసింది.
డిజిటల్ ఆధారాల ఆధారంగా ఎండీ విశాకన్, జీఎం సంగీత వంటి అధికారుల మొబైల్ ఫోన్ లను స్వాధీనం చేసుకోవడం, డేటా వెలికితీత చట్టబద్దమై, పీఎంఎల్ఏ సెక్షన్ 17 (1)(ii) ప్రకారం వాటిని ఫోరెన్సిక్ నిపుణులచే పరీక్షించామని పేర్కొంది.
ఈసీఐఆర్.. ఒక ఎఫ్ఐఆర్ కాదు..
ఎన్ ఫోర్స్ మెంట్ కేసు సమాచారం నివేదిక(ఈసీఐఆర్) అందకపోవడంపై టాస్మాక్ చేసిన ఫిర్యాదును పక్కన పెట్టారు. ఈసీఐఆర్ అనేది అంతర్గత పత్రం అని, అది ఎఫ్ఐఆర్ తో సమానం కాదని సుప్రీంకోర్టు విజయ్ మదన్ లాల్ చౌదరి(2022) తీర్పును ఈడీ ఉదహరించింది.
‘‘ఆర్టికల్ 22(1) ప్రకారం అరెస్ట్ కు కారణాలు సరిపోతాయి’’ అని ఈడీ వాదించింది. టాస్మాక్ లేవనెత్తిన గోప్యత, ప్రసంగ హక్కుల గురించి కూడా నేర గుర్తింపు వంటి సహేతుకమైన పరిమితులకు లోబడి ఉంటాయని పేర్కొంది.
ఈ శోధనను ‘‘ఫిషింగ్ యాత్ర( ఎవరో టార్గెటెడ్ వ్యక్తి)’’ పేర్కొనడం నిరాధారమని, అవినీతికి మనీలాండరింగ్ ఆధారాలను వెలికితీసేందుకు ఇది లక్ష్యంగా చేసుకున్న ప్రయత్నం అని ఈడీ పేర్కొంది. టెండర్ రికార్డులతో సహా స్వాధీనం చేసుకున్న పత్రాలు నేరం ద్వారా వచ్చిన ఆదాయాన్ని గుర్తించడంలో కీలకమైనవని అది పేర్కొంది.
ఈ కేసులో ప్రజా ప్రయోజనాన్ని కూడా ఈడీ వివరించింది. గణనీయమైన ప్రజా నిధులను నిర్వహించడంలో టాస్మాక్ పాత్రను గుర్తు చేసింది. ఈ దర్యాప్తు ప్రజా ధనాన్ని రక్షిస్తుంది, పారదర్శకతను నిర్ధారిస్తుంది, అవినీతి నిరోధిస్తుంది’’ అని ఈడీ కౌంటర్ ఇచ్చింది. మనీలాండరింగ్ దేశ ఫ్రాబ్రిక్ కు ముప్పును హైలైట్ చేసింది.
ఈ కేసులో పీఎంఎల్ఏ అమలు, కార్పొరేట్ జవాబుదారితనాన్ని స్పష్టం చేసే తీర్పు వస్తుందని న్యాయ నిపుణులు అంచనా వేస్తున్నారు.
Tags:    

Similar News