సీనియర్ సిటిజన్లకు రూ. 5 లక్షల ఆరోగ్య బీమా..

ఆదాయంతో సంబంధం లేకుండా 70 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వృద్ధులందరికీ కేంద్ర ప్రభుత్వం ఆరోగ్య బీమా పథకాన్ని అందుబాటులోకి తేనుంది.

Update: 2024-10-27 12:41 GMT

ఆదాయంతో సంబంధం లేకుండా 70 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వృద్ధులందరికీ కేంద్ర ప్రభుత్వం ఆరోగ్య బీమా పథకాన్ని అందుబాటులోకి తేనుంది. ఆయుష్మాన్ భారత్ ప్రధాన్ మంత్రి జన్ ఆరోగ్య యోజన (AB PM-JAY)గా పిలిచే ఈ పథకం ద్వారా రూ. 5 లక్షల వరకు ఉచితంగా వైద్యం చేస్తారు. అక్టోబర్ 29న ప్రారంభించే ఈ పథకం కింద సుమారు 4.5 కోట్ల కుటుంబాలకు ప్రయోజనం చేకూరనుంది. ఆధార్ కార్డులో ఉన్న వయస్సును పరిగణనలోకి తీసుకుంటారు. సెప్టెంబర్ 1, 2024 వరకు PMJAY కింద 12,696 ప్రైవేట్ ఆసుపత్రులతో సహా మొత్తం 29,648 ఆసుపత్రులకు ఈ పథకాన్ని అనుసంధానం చేశారు. ప్రస్తుతం ఢిల్లీ, ఒడిశా, పశ్చిమ బెంగాల్ మినహా 33 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఈ పథకం అమలవుతోంది. 70 ఏళ్లు పై బడిన వారు తమ వివరాలను PMJAY పోర్టల్‌ లేదా ఆయుష్మాన్ యాప్‌లో నమోదు చేసుకున్న వారు మాత్రమే అర్హులు. ఇప్పటికే ఆయుష్కాన్ కార్డు ఉన్న వారు eKYCని పూర్తి చేసి కొత్త కార్డుకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

అందుబాటులోకి U-విన్ ప్లాట్‌ఫారమ్..

కోవిడ్-19 వ్యాక్సిన్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ కో-విన్‌ లాగే U-విన్‌ (యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్)ను అందుబాటులోకి తేనున్నారు. గర్భిణులు, పురిటి పిల్లల నుంచి 17 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు వేయించే టీకాల వివరాలను డిజిటలైజ్ చేస్తారు.

Tags:    

Similar News