బ్యాంకర్లతో నిర్మలా సీతారామన్ సమీక్ష సమావేశం

సైబర్ దాడులతో ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసే అవకాశం...;

Update: 2025-05-09 12:02 GMT
Click the Play button to listen to article

భారత్ - పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న తరుణంలో.. సైబర్ దాడులతో పాక్ (Pakistan) మన దేశ ఆర్థిక వ్యవస్థను అస్థిరపరిచే అవకాశం ఉంది. ఆర్థిక లావాదేవీలో ఒక చిన్న అంతరాయం కూడా ఖతాదారుడిపై ఎక్కువ ప్రభావం చూపే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ రోజు సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. వివిధ ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI), నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI), NSE, BSE, ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం (Cert-In) ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరవుతారని భావిస్తున్నారు. భారతదేశంలోని కీలక రంగాల్లో బ్యాంకింగ్ ఒకటి. సైబర్ దాడులను ఎదుర్కోవడంపై సీతారామన్ (Nirmala Sitharaman) సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నారు. 

Tags:    

Similar News