అరెస్టులు జరగొచ్చు..కేసీఆర్

'కాళేశ్వరం కమిషన్ కాదు.. కాంగ్రెస్ కమిషన్ 'అని వ్యాఖ్యానించిన బీఆర్ఎస్ అధినేత;

Update: 2025-08-04 13:01 GMT

కాళేశ్వరం కమిషన్ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చిన నేపధ్యంలో ఎర్రవల్లిలోని తన ఫామ్ హౌస్‌లో పార్టీ ముఖ్య నేతలతో బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ కీలక సమావేశం నిర్వహించారు.పార్టీ ముఖ్య నేతలతో ఈ సందర్బంగా కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి."అది కాళేశ్వరం కమిషన్ కాదు.. కాంగ్రెస్ కమిషన్ ,ఈ కమిషన్ రిపోర్ట్ ఊహించిందే ,దీనిపై ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు " అన్నారు."కొంత మంది బీఆర్ఎస్ నేతలను అరెస్ట్ చేయవచ్చు..ఎవరూ భయపడాల్సిన పనిలేదు " అంటూ కేసీఆర్ నేతలకు సూచించారు.

కాళేశ్వరం ప్రాజెక్ట్ పనికిరాదన్నవాడు అజ్ఞాని అని ఆయన అభివర్ణించారు. కాంగ్రెస్ దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని బీఆర్ఎస్ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రయోజనాలను ప్రజలకు వివరించాలని సూచించారు. కాళేశ్వరంపై కేబినెట్‌లో ఏం నిర్ణయం తీసుకుంటారో వేచి చూద్దామని పార్టీ నేతలతో కేసీఆర్ అన్నారు.
కేసీఆర్ ను తప్పు పట్టిన కాళేశ్వరం కమిషన్
కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో చోటు చేసుకున్న అవకతవకలపై విచారణకు జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్‌ను కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది.దాదాపు 15 నెలలపాటు ఈ కమిషన్ విచారణ జరిపింది. జులై 31వ తేదీన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ తన నివేదికను నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జాకు అందజేసింది. ఈ నివేదికపై ముగ్గురు అధికారులతో ఒక కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆ కమిటీ కూడా ఆదివారం సమావేశమై, కమిషన్ రిపోర్ట్ ను పూర్తిగా అధ్యయనం చేసి క్యాబినెట్ కు అందించింది. చర్చింది. కేబినెట్ భేటీలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ పై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు.ఈ ప్రాజెక్ట్‌కు కర్త, కర్మ,క్రియ అంతా కేసీఆర్ అని కమిషన్ నివేదిక తేల్చింది.
Tags:    

Similar News