యువతి ఆత్మహత్య కేసులో ప్రియుడు అరెస్ట్

చెడు అలవాట్లకు బానిసై వేధించినట్లు ఆరోపణలు;

Update: 2025-07-28 13:49 GMT

జూబ్లిహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ నెల 10 వ తేదీన రేణుక అనే యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటనలో నిందితుడైన చల్లా వినయ్ కుమార్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల కథనం ప్రకారం కృష్ణానగర్ బి బ్లాక్ కు చెందిన రేణుక చల్లా వినయ్ కుమార్ ప్రేమించుకుంటున్నారు. అయితే చల్లా వినయ్ కుమార్ ప్రవర్తనలో మార్పులు రావడంతో రేణుక కొంతకాలంగా దూరంగా ఉంటోంది.మద్యానికి, డ్రగ్స్ కు బానిస అయిన చల్లా వినయ్ కుమార్ ఈ నెల 9న రేణుక పని చేస్తున్న ఆఫీసుకు వెళ్లి ఘర్షణ పడ్డాడు. ఆమె పని చేస్తున్న ఆఫీసు నుంచి బలవంతంగా తీసుకెళ్లాడు. ఆమె బైక్ పైనే రేణుకను కూర్చోబెట్టుకుని దూషిస్తూ రాష్ డ్రైవింగ్ చేస్తుండగా జూబ్లిహిల్స్ ట్రాఫిక్ పోలీసుల కంటబడ్డాడు. పోలీసులు బైక్ ను స్వాధీనం చేసుకున్నారు. బైక్ లేకుండా ఇంటికి వెళ్లిన రేణుకను తల్లి ప్రశ్నించింది. మెకానిక్ కు ఇచ్చానని రేణుక చెప్పింది. ఆ మరుసటిరోజే రేణుక తన ఇంట్లో ఆత్మహత్య చేసుకుంది.

కేసు నమోదు చేసుకున్న జూబ్లిహిల్స్ పోలీసులు ఆత్మహత్యకు కారణమైన వినయ్ కుమార్ ను అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపారు.

Tags:    

Similar News