సజీవ దహనం దృ శ్యాలు

నిద్రలోనే కబళించిన మృత్యువు

Update: 2025-10-24 03:37 GMT
దగ్ధమైన బస్ ను పరిశీలిస్తున్న కలెక్టర్ సిరి

ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాలో శుక్రవారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం రాష్ట్రాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. హైదరాబాద్ నుంచి బెంగళూరు బయలుదేరిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు టేకూరు మండలం ఉల్లిందకొండ సమీపంలో బైక్‌తో ఢీకొని దగ్ధమైంది. ఈ ప్రమాదంలో 20 మందికి పైగా మృతి చెందగా, 15 మంది తప్పించుకుని గాయాలతో ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

కావేరి ట్రావెల్స్‌కు చెందిన వోల్వో బస్సు (నంబర్: DD01N9490) గురువారం రాత్రి 10:30 గంటలకు హైదరాబాద్‌కు చేరుకుని, తెల్లవారుజామున కర్నూలు హైవేలో బైక్‌ ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు ఫ్యూయల్ ట్యాంక్ బాంబు మాదిరిగా పేలి మంటలు అంటుకున్నాయి. బస్సులో 41 మంది ప్రయాణికులు ఉండగా, 20 మంది పైగా సజీవ దహనమయ్యారు.

పోలీసుల ప్రకారం, డ్రైవర్, సహాయక డ్రైవర్ ప్రమాదం తర్వాత పరారయ్యారు. తాజాగా వారిని అరెస్ట్ చేసి ప్రశ్నిస్తున్నారు.

కల్లూరు మండలం చిన్నటేకూరులో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాద ఘటన ప్రదేశాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ డా. ఏ సిరి

20 మందిలో 11 మంది మృతదేహాలను పోలీసులు గుర్తించారు. మిగిలిన వారిని గుర్తించే పనిలో ఉన్నామని కర్నూలు జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి తెలిపారు.


ప్రమాద స్థలంలో కలెక్టర్, ఎస్పీ


బాధితుల బంధువులను వివరాలు అడిగి తెలుసుకుంటున్న కర్నూలు కలెక్టర్ సిరి


జల్లెడలా మిగిలిన దగ్ధమైన బస్


బస్ వద్ద బాధిత కుటుంబాల వేదన


పూర్తిగా కాలిన బస్


బస్ లోపల దహనమైన ప్రయాణికుల శకలాలు


దగ్ధమైన బస్ ను పరిశీలిస్తున్న అధికారులు.


Tags:    

Similar News