ఈ నెల 10న కేబినెట్ భేటీ
స్థానిక సంస్థల ఎన్నికలపై ఫోకస్;
By : B Srinivasa Chary
Update: 2025-07-07 13:45 GMT
ఎట్టకేలకు తెలంగాణ కేబినెట్ తేదీ ఫిక్స్ అయింది.
స్థానిక సంస్థల ఎన్నికలు సెప్టెంబర్ 30వతేదీ లోపు జరపాలని హైకోర్టు ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. వర్షాకాలం ప్రారంభమైన సందర్బంగా రైతులకు తక్షణ సాయంపై చర్చించనున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీలో సిక్స్ గ్యారెంటీలు ఉన్నాయి. వీటిని అమలు చేయడంలో ప్రభుత్వం ఫోకస్ పెట్టనుంది. ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొచ్చే సంక్షేమ పథకాలు అమలు చేయడానికి సాధ్యా అసాద్యాలపై చర్చించనున్నారు. ఇందిరమ్మ ఇళ్లపై కేబినెట్ లో మరోసారి చర్చించాలని రేవంత్ రెడ్డి సర్కారు యోచిస్తోంది.