అసభ్య పోస్టులపై సీఎం హెచ్చరికలు, చర్యలకు తెలంగాణ పోలీసుల సమాయత్తం
సామాజిక మాధ్యమాల్లో అసభ్య పోస్టులు పెట్టేవారిని ఉప్పు పాతరేస్తామని సీఎం ఎ రేవంత్ రెడ్డి హెచ్చరించిన నేపథ్యంలో తెలంగాణ పోలీసులు చర్యలకు సమాయత్తం అయ్యారు.;
జర్నలిస్టుల ముసుగులో సామాజిక మాధ్యమాల్లో కుటుంబ సభ్యులపై అసభ్య పోస్టులు పెట్టే వారిని ఉప్పుపాతరేస్తామని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి అసెంబ్లీలోనే బహిరంగంగా ప్రకటించారు. ఇంట్లో ఆడవారిని సామాజిక మాధ్యమాల్లో తిడుతున్న వారిని, వారికి వంతపాడుతున్న వారిని వదిలే ప్రసక్తే లేదని సీఎం హెచ్చరించారు.
సోషల్ మీడియా, యూట్యూబ్ ఛానళ్లలో జర్నలిస్టుల పేరిట విషం చిమ్ముతున్న వారి భరతం పడతామని సీఎం తీవ్ర స్థాయిలో హెచ్చరించారు. జర్నలిస్టుల ముసుగులో యూ ట్యూబ్ ఛాలెల్ పెట్టుకొని అడ్డగోలుగా మాట్లాడే వారి ఆటలు సాగనివ్వనని, వారిని శిక్షించేందుకు చట్టాలు చేస్తామని సీఎం చెప్పారు. పెయిడ్ ఆర్టిస్టులను పార్టీ కార్యాలయాల్లో పెట్టి రికార్డు చేసి వాటిని సామాజిక మాధ్యమాల్లో పెట్టే వారిని అరెస్ట్ చేస్తామని ప్రకటించారు.
సోషల్ మీడియాలో వీడియోలు పోస్ట్ చేసేవాళ్లు విజ్ఞానాన్ని, వినోదాన్ని అందించాలి. అంతేకానీ డబ్బుల కోసం ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తే కఠిన చర్యలుంటాయి. జీవితాలను నాశనం చేసే బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేసేవారిపై నిఘా ఉంటుందని గుర్తుంచుకోండి. #TelanganaPolice #SayNoToBettingApps pic.twitter.com/ZRzr8TjTKA
— Telangana Police (@TelanganaCOPs) March 15, 2025
𝗔𝗿𝗿𝗲𝘀𝘁 𝗼𝗳 𝗧𝘄𝗼 𝗔𝗰𝗰𝘂𝘀𝗲𝗱 𝗣𝗲𝗿𝘀𝗼𝗻𝘀 𝗶𝗻 𝗦𝗼𝗰𝗶𝗮𝗹 𝗠𝗲𝗱𝗶𝗮 𝗧𝗿𝗼𝗹𝗹𝗶𝗻𝗴 𝗖𝗮𝘀𝗲𝘀.
— Hyderabad City Police (@hydcitypolice) March 12, 2025
Hyderabad Cyber Crime Police apprehended two accused persons in Cr. No.527/2025 U/Sec 67 IT Act, Sec 111, 61(2), 353(2), 352 of BNS by name 1) Pogadadanda Revathi… pic.twitter.com/MNWXwVRshD