మళ్లీ తెలంగాణ ఉద్యోగ జేఏసీ.. అసలు డిమాండ్స్ ఇవే

తెలంగాణ ఉద్యమం తరువాత మళ్లీ తెలంగాణ ఉద్యోగ జేఏసీ ఏర్పాటు

Update: 2024-08-12 14:21 GMT

తెలంగాణ ఉద్యమం తరువాత మళ్లీ తెలంగాణ ఉద్యోగ జేఏసీ ఏర్పాటైంది. సోమవారం అన్ని ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో జేఏసీని ఏర్పాటు చేస్తున్నట్లు నేతలు ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వంపై తమ హక్కుల కోసం పోరాటం చేసేందుకే జేఏసీని పునరుద్ధరించినట్లు వారు తెలిపారు. 15 రోజుల్లో ఉద్యోగ జేఏసీ భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామన్నారు.

కార్యక్రమంలో జేఏసీ నేతలు మాట్లాడుతూ... ఆనాడు తెలంగాణ ఉద్యమం కోసం ఏ విధంగా జేఏసీ ఏర్పాటు చేశామో ఇప్పుడు మళ్లీ జేఏసీ ఏర్పాటు చేసుకోవడం జరిగిందన్నారు. ఈ ప్రభుత్వం వచ్చి 9 నెలలు అవుతుంది... మ్యానిఫెస్టోలో త్వరితగతిన పీఆర్సీ అని,టీఏ, డీఏ ఇస్తాం అని చెప్పారు. ఇంకా ఇవ్వడం లేదని చెప్పారు. నాలుగు డీఏ లు రాలేదు.. గతంలో మేము రెండు డీఏ లు ఇవ్వకుంటేనే ధర్నాలు చేసేవాళ్ళం.. కానీ ఇప్పుడు 4 డీఏలు పెండింగ్ లో ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం మరో డీఏ ఇచ్చే సమయం వచ్చింది. 5 డిఎలు పెండింగ్ లు ఉన్నాయి అని తెలిపారు.

ఇంకా నేతలు ఏమన్నారంటే...

సిపిఎస్ ను రద్దు చేసి ఓపిఎస్ వెంటనే అమలు చేయాలి. మ్యానిఫెస్టోలో కూడా పెట్టారు.

హెల్త్ స్కిం వెంటనే అమలు చేయాలి. గత ప్రభుత్వం మాకు కట్రిబ్యూషన్ కింద హెల్త్ స్కిం చేస్తాం అన్నారు జీవో కూడా వచ్చింది.

ఈ ప్రభుత్వం లో మమ్ములను కలుస్తాం అన్నారు... కలిసి మా సమస్యలు పరిష్కరించాలని అడిగితే కలిసే పరిస్థితి లో ముఖ్యమంత్రి లేడు ప్రభుత్వం లేదు.

భాగ్యనగర్ సొసైటీ, ఇతర సొసైటీ భూములను మాకు అప్పగించాలని కోరుతున్నము.

అన్ని జిల్లాలో తిరిగి అందరిని కలుపుకొని ముందుకు పోతాం.

ఎన్నికల సమయంలో బదిలీ చేసిన ఉద్యోగులను తిరిగి పాత ప్రాంతాలకు బదిలీ చేయాలి.

మా ఉద్యమాన్ని మరింత ఉదృతం చేస్తాము.

జెఎసి అనేది ఉద్యోగ సంఘాల వల్ల ఏర్పడింది. అన్ని ఉద్యోగ సంఘాలు కలిసి ఏర్పాటు చేయడం జరిగింది.

ప్రధాన సమస్యలు ముందుకు తెచ్చి పోరాటం చేస్తాం.

మ్యానిఫెస్టోలో పెట్టి హామీలు అమలు చేయమని మేము అడుగుతున్నాము.

ఒకటవ తేదీన జీతాలు ఇస్తున్నారు కానీ ఇంకా కొన్ని డిపార్ట్మెంట్ లకు జీతాలు ఒకటవ తేదీన రావడం లేదు.

మాకు న్యాయమైన డిమాండ్ లు వెంటనే పరిస్కారం చేయాలి.

సమస్యలు పరిస్కారం చేయకుంటే మా కార్యాచరణ ఉంటుంది.

మా సమస్యలపై మేము అందరిని కలుస్తాం.

గురుకుల పాఠశాలలో సమస్యలు వెంటనే పరిస్కారం చేయాలి.

ఉమ్మడి రాష్ట్రంలో మాదిరి ఈ జెఎసి పని చేస్తోంది.

కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ చేయాలి.

Tags:    

Similar News