కల్తీ కల్లు ఘటనకు ప్రభుత్వమే బాధ్యత : కెటీఆర్

చనిపోయిన వారికి 20 లక్షలు ఇవ్వాలి;

Update: 2025-07-10 16:02 GMT

కాయకష్టం చేసే కష్ట జీవులు కల్తీ కల్లు బారిన పడకుండా చూసే బాధ్యత పూర్తిగా పాలకులపై ఆధారపడి ఉంటుందని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటీఆర్ అన్నారు. హైద్రాబాద్ కూకట్ పల్లిలో కల్తీ కల్లు తాగి ఆరుగురు చనిపోవడం పట్ల తీవ్ర విచారంవ్యక్తం చేశారు.ఈ ఘటనపై కెటీఆర్ స్పందించారు. చనిపోయిన వ్యక్తుల కుటుంబాలకు 20 లక్షల ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని కెటీఆర్ డిమాండ్ చేశారు. కల్తీ కల్లును అరికట్టాల్సిన ఎక్సైజ్ అధికారులే లోపాయికార ఒప్పందాలతో కల్తీని అరికట్టలేకపోతున్నారని కెటిఆర్ ఆరోపించారు.

బాధితులకు మెరుగైన వైద్య చికిత్స అందించాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఘటన చోటు చేసుకుందన్నారు.

Tags:    

Similar News