హెచ్ సిఏ స్కాం నిందితులను 10 రోజుల కస్టడికి ఇవ్వండి

మల్కాజ్ గిరి కోర్టులో సిఐడి పిటిషన్;

Update: 2025-07-14 08:25 GMT

హైదరా బాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్ సి ఏ) స్కాంలో రిమాండ్ లో ఉన్న ఐదుగురు నిందితులను 10 రోజులపాటు తమ కస్టడీకి ఇవ్వాలని మల్కాజ్ గిరి కోర్టులో సిఐడి సోమవారం పిటిషన్ వేసింది. హెచ్ సి ఎ స్కాంలో ప్రధాన నిందితుడైన జగన్ మోహన్ రావుతో పాటు మిగతా నలుగురు నిందితులను రిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. నలుగురు నిందితులు చర్లపల్లి జైలులో రిమాండ్ ఖైదీలుగా ఉంటే శైలజా యాదవ్ చెంచల్ గూడలోని మహిళాసెల్ లో  ఉన్నారు. ఈ కేసులో మరో నిందితుడు దేవరాజ్ కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి.   ఈ కేసులో 170  కోట్ల  అవినీతి  జరిగినట్టు ఆరోపణలున్నాయి

Tags:    

Similar News