‘పీసీసీ అధ్యక్షడిని అవుతానని ఊహంచలేదు’.. మహేష్ కుమార్

తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ఈరోజు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Update: 2024-09-15 11:59 GMT

తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ఈరోజు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భగవద్గీత అందరికీ స్ఫూర్తి కావాలని, అందులో చెప్పినట్లు చేస్తే ప్రతి ఒక్కరూ విజయం సాధిస్తారని చెప్పుకొచ్చారు. తన ఎంపికను రాహుల్ గాంధీ కూడా మెచ్చుకున్నారని, తెలంగాణ కాంగ్రెస్ అంతా కూడా పీసీసీ అధ్యక్షుడిగా ఒకే పేరు సిఫార్సు చేయడంతో తాను ఆశ్చర్యపోయానని రాహుల్ గాంధీ చెప్పారని, అటువంటి కీలక నేత అయిన మహేష్‌ను కలవాలని అన్నారని తనకు రేవంత్ చెప్పారని తెలిపారు. కానీ టీపీసీసీ అధ్యక్షుడినవుతానని ఎన్నడూ ఊహించలేదని, కలలో కూడా ఈ ఆలోచన తనకు రాలేదని అన్నారు. ఆయన వ్యాఖ్యలు ప్రస్తుతం ఆసక్తికరంగా మారాయి. ఈ సందర్భంగానే 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న తాను మెయిన్‌స్ట్రీమ్ పాలిటిక్స్‌లో రాకపోవడానికి చాలా కారణాలు ఉన్నాయని చెప్పుకొచ్చారు. మరెన్నో విషయాలను ఆయన పంచుకున్నారు.

భగవద్గీత చెప్పిందే..

‘‘మనకు భగవద్గీత ఏం చెప్తుందంటే.. నువ్వు చేయాల్సింది చెయ్యి. నీకు రావాల్సింది నీకు వస్తుందని. నేను కూడా అంతే చేశా. ప్రతి ఒక్కరూ దీనిని స్ఫూర్తిగా తీసుకోవాలి. పీసీసీ అధ్యక్ష పదవిని చేపడానని నేను కూడా అనుకోలేదు. ఏదో అప్పుడప్పుడు రేవంత్ రెడ్డి అంటుండేవారు.. నా తర్వాత పార్టీని మీరే నడిపించాలన్న అని. ఆ మాటే నేడు వాస్తవం అవయింది. ఎక్కడో మారుమూల గ్రామంలో పుట్టిపెరిగిన నేను ఈరోజు టీపీసీసీ అధ్యక్షుడన్యాను. ఇది కాంగ్రెస్‌లోనే సాధ్యం. పీసీసీ అధ్యక్షుడిని అయినా నేను కాంగ్రెస్ కార్యకర్తల్లో ఒకడిగానే ఉంటా. మీ ప్రతి సమస్యను పార్టీ దృష్టికి తీసుకెళ్తా. ప్రభుత్వానికి, కార్యకర్తలకు మధ్య వారధిగా పనిచేస్తా. ప్రతి రోజూ 7-9 గంటల పాటు గాంధీ భవన్‌లోనే ఉంటా. ప్రతి రోజూ ఉదయం గాంధీభన్‌కు వెళ్ల రెండు ఇరానీ చాయ్‌లు తాగందే నాకు రోజు మొదలు కాదు. కాబట్టి ఎవరైనా ఎప్పుడైనా గాంధీ భవన్‌కు వచ్చి మీ సమస్యను నాకు తెలిపితే.. దానిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాను’’ అని ఆయన చెప్పుకొచ్చారు.

Tags:    

Similar News