‘ప్రజా సమస్యలపై అసెంబ్లీలో పోరాడాలి’

ఆరు గ్యారంటీల అమలులో ప్రభుత్వం అనుసరిస్తున్న మోసపూరిత వైఖరిని నిలదీయాలి.;

Update: 2025-03-11 15:34 GMT

తెలంగాణ బడ్జెట్ సమావేశాలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో మంగళవారం బీఆర్ఎస్ పార్ట ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో తెలంగాణ భవన్‌లో సమావేశ నిర్వహించారు తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్. ఈ సమావేశంలో నేతలకు కేసీఆర్ కీలక సూచనలు చేశారు. అసెంబ్లీ వ్యవహరించాల్సిన తీరుపై దిశానిర్దేశం చేశారు. ప్రతి ఒక్కరూ నిర్ణీత సమయానికి సభకు హాజరుకావాలని తెలిపారు. కేసీఆర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశం దాదాపు మూడు గంటల పాటు జరిగింది. ఈ సందర్భంగా పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ప్రజల పక్షాన గట్టిగా పోరాడాలని సమావేశంలో నిర్ణయించారు.

 

అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వ వైఫల్యాలను, ప్రజలకు ఇచ్చి నెరవేర్చని హామీలపై ప్రశ్నించాలని చెప్పారు. ప్రభుత్వ అవినీతి, ప్రజా వ్యతిరేక కార్యక్రమాలై ప్రభుత్వాన్ని చీల్చి చెండాడాలని అన్నారు. అదే విధంగా బీఆర్ఎస్‌పై ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలు తిప్పికొట్టాలని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజలు, రైతులు, యువత, నిరుద్యోగులు పడుతున్న కష్టాలను సభల్లో ప్రస్తావించాలన్నారు. ప్రతి ఒక్కరూ తమతమ సబ్జెక్ట్‌పై తరువుగా ప్రిపేర్ కావాలని సూచించారు. సభల్లో ఇంకా ప్రతిభావంతంగా ప్రజాసమస్యల మీద పోరాడేందుకు సభ్యులను ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకునేందుకు డిప్యూటీ లీడర్లను నియమించనున్నట్టు కేసీఆర్ తెలిపారు.

ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమల్లో వైఫల్యంపై ప్రభుత్వాన్ని నిలదీయాలన్నారు కేసీఆర్. అప్పుల విషయంలో కాంగ్రెస్ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని, గోబెల్స్ అబద్ధాలను ఎంగట్టాలన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్ల పాలనలో రూ.4 లక్షల కోట్ల అప్పులు చేస్తే.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 15 నెలల్లోనే రూ.1.5 లక్షల కోట్ల అప్పులు చేసిందని, ఇంత అప్పు చేసినా ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడం మాత్రం ఈ ప్రభుత్వానికి చేతకావడం లేదని దుయ్యబట్టారు కేసీఆర్.

 

కాంగ్రెస్ హాయంలో రైతులకు కన్నీరు పెడుతున్నారని, వారికి రైతు బంధు, సాగునీరు ఇవ్వకుండా ప్రభుత్వం ఇబ్బంది పెడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘అసెంబ్లీ సమావేశాలకు నేనూ హాజరవుతాను. ఉదయం 9:30 గంటలకల్లా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా అసెంబ్లీకి చేరుకోవాలి. అసెంబ్లీ లేవనెత్తాల్సిన అంశాలపై, అసెంబ్లీలో నడుచుకోవాల్సిన తీరుపై చర్చిద్దాం. ప్రతి ఎమ్మెల్యే ప్రతి రోజూ అసెంబ్లీకి రావాలి. సభలో మాట్లాడే ప్రతి అంశంపై నేతలు పూర్తి అవగామన పెంచుకోండి’’ అని దిశానిర్దేశం చేశారు కేసీఆర్.

‘‘పార్టీ శాసన సభ, మండలి సభ్యులందరూ నిర్ణీత సమయానికి హాజరు కావాలి. తెలంగాణ ప్రజా సమస్యలపై రాజీలేని పోరాటం చేయాలి. రాష్ట్ర ప్రభుత్వ అవినీతి పై, ప్రజా వ్యతిరేక కార్యక్రమాలపై చీల్చి చెండాడాలి. బి ఆర్ ఎస్ మీద రాష్ర్ట ప్రభుత్వం చేస్తున్న తప్పుడు నిందలను తిప్పి కొట్టాలి. రాష్ర్టంలో నెలకొన్న పలు సమస్యలు.. ఎండిన పంటలు, అందని కరెంటు, అందని సాగునీరు, కాలిపోతున్న మోటర్లు తదితర రైతాంగ సమస్యలపై, మంచినీటి కొరత పై అసెంబ్లీ లో మండలి లో పోరాడాలి. బీసీ రిజర్వేషన్లు, ఎస్సీ రిజర్వేషన్ల బిల్లుకు మద్దతుగా గొంతు వినిపించాలి. రాష్ట్రం లో గురుకుల పాఠశాలలు నిర్వీర్యమౌతున్న తీరుపై మాట్లాడాలి. ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ బెనిఫిట్స్... డి ఎ ల పెండింగు... పీఆర్సీ అమలు పై అసెంబ్లీ మండలి వేదికగా ప్రభుత్వాన్ని నిలదీయాలి’’ అని అన్నారు.

 

‘‘మహిళలకిచ్చిన వాగ్ధానాలను నెరవేర్చాలని కొట్లాడాలి. ఆరు గ్యారంటీ ల అమలు లో ప్రభుత్వం అనుసరిస్తున్న మోసపూరిత వైఖరిని నిలదీయాలి. విద్యార్థుల ఓవర్సీస్ స్కాలర్షిప్ లు విడుదలచేయక పోవడం గురించి, వైద్య రంగంలో దిగజారుతున్న ప్రమాణాలు, తదితర ప్రహజసమస్యలపై ఎండగట్టాలి. దళిత బంధును నిలిపివేయడం పట్ల ప్రశ్నించాలి. గొర్రెల పెంపకం.. చేపల పంపిణీ సమగ్ర అమలు కోసం.. అసెంబ్లీ మండలి లో ప్రభుత్వాన్ని నిలదీయాలి. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో రాష్ట్ర ప్రజలు పడుతున్న కష్టాలను, వారి ఆకాంక్షలను అర్థం చేసుకొని వారి గొంతుకగా బి ఆర్ ఎస్ సభ్యులు ఉభయ సభల్లో ప్రభుత్వాన్ని పశ్నించాలి’’ అని కేసీఆర్ దిశా నిర్దేశం చేశారు.

Tags:    

Similar News